Breaking News

Daily Archives: February 8, 2025

విస్తృత జ‌న‌జాగృతితో న‌వోద‌యానికి కృషిచేద్దాం..

– ఎ.కొండూరు కిడ్నీ వ్యాధి ప్ర‌భావిత ప్రాంతాల్లో పెద్దఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి – స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేయండి – ప్ర‌చార సామ‌గ్రితోపాటు డిజిట‌ల్ మెటీరియ‌ల్‌నూ రూపొందించాలి – నెఫ్రాల‌జిస్టు, డ‌యాల‌సిస్ సేవ‌లు నిరాటంకంగా కొన‌సాగాలి – సీకేడీ నివార‌ణ‌, నియంత్ర‌ణ స‌మ‌న్వ‌య స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు కిడ్నీ వ్యాధుల ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య‌శాఖ‌.. వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో విస్తృత జ‌న‌జాగృతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, …

Read More »

అనధికార కట్టడాలు నిర్మాణం జరగకుండా ప్లానింగ్ కార్యదర్శులు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా అనధికార కట్టడాలు నిర్మాణం జరగకుండా ప్లానింగ్ కార్యదర్శులు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా వికాస్ నగర్, ఎస్విఎన్ కాలనీ, కొరెటేపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ …

Read More »

ఢిల్లీ లో బిజెపి గెలుపు తో అంబరాన్ని తాకిన సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో బిజెపి గెలుపు తో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని తాకేలా విజయోత్సవాలు నిర్వహించారు. కౌంటింగ్ లో బిజెపి తొలి నుంచీ బిజెపి మెజారిటీ సాధిస్తూ ఉండడంతో బిజెపి నేతలు బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుని బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి గెలుపు ఆస్వాదించారు. ఈసందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆప్ ముసుగులో ఉన్న వామ పక్ష భావజాలం పై గెలుపు గా బిజెపి స్పష్టం చేసింది. కాంగ్రెస్ కు …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా క్లినికల్ సైకాలజీ కోర్సులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సుల్ని ప్రారంభించ‌నున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను. వైద్య రంగానికి ఎంతో ముఖ్య‌మైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌వేశ పెట్ట‌క‌పోవ‌డం దుర‌దృష్టం. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మ‌రియు చికిత్స అందించ‌డంలో క్లినికల్ సైకాలజిస్టులు కీల‌క పాత్ర వ‌హిస్తారు. దీంతోపాటు అన్ని ర‌కాల రోగులు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవ‌డం (రిహేబిలిటేష‌న్‌)లో కూడా ప్ర‌ధాన భూమిక వ‌హిస్తారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో …

Read More »

కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

-భక్తులకు ట్రాఫిక్, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు -గత ఐదేళ్లలో కోటప్పకొండ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యింది -కోటప్పకొండను అభివృద్ధి చేసిన ఘనత కోడెలదే -రానున్న రోజుల్లో కోటప్పకొండను మరింత అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది -ప‌ల్నాడు ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి\ప‌ల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కోట‌ప్పకొండ త్రికోటేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే తిరునాళ్ల‌కు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ప‌ల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి …

Read More »

భూముల క్రమబద్దీకరణకు ఇలా దరఖాస్తు చేసుకోండి

-రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మి -మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్దం -వేగంగా, ప్రామాణికమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన రెవిన్యూ యంత్రాంగం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది నిరు పేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ …

Read More »

ఈ నెల 10న ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలి

-అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలి -పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు. వి ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10 వ తేదీన జరిగే ‘పరీక్షా పే చర్చ 2025’లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో చేపట్టిన సంభాషణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ వీక్షించాలని, ఈ దిశగా పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాలని ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖాధికారులు, డైట్ ప్రిన్సిపాళ్లకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు. వి ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

ఇద్దరు గ్రామ సర్వేయర్ల , 12 మంది డిప్యూటీ తాహాసిల్దార్లు / మండల సర్వేయర్ల కు షో కాజ్ నోటీసు జారీ

-విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలి- జవాబుదారీతనం ఉండాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియను నిర్దుష్టమైన మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందని, అందులో భాగంగా నిర్లక్ష్యం వహించిన అధికారులకు సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇద్దరు గ్రామ సర్వేయర్లు కి షో కాజ్ నోటీసు జారీ : నిబంధనలు అనుసరించి …

Read More »

డిజెబిలిటి ప్రివెన్షన్ మెడికల్ రిహ్యాబిలిటేషన్ కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తిరుపతి జిల్లా తిరుపతి అనంత శయనం లెప్రసి కాలని నందు DPMR (డిజెబిలిటి ప్రివెన్షన్ మెడికల్ రిహ్యాబిలిటేషన్) కార్యక్రమము నిర్వహించ బడినది. ఈ కార్యక్రమము లో కుష్టు వ్యాధి వలన అంగవైకల్యము తో బాధ పడే రోగుల గాయాలకు ఆయింట్‌మెంట్ పూసి బ్యాండేజ్‌ క్లాత్ తో కట్లు కట్టడం జరిగినది. కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలక్రష్ణ నాయక్ ప్రసంగిస్తూ కుష్టు వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే జబ్బు …

Read More »

వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ వైద్య విద్యార్థులకు అందజేస్తున్న మాదిరిగా తమకూ స్టయిఫండ్ ఇచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఏపీ వెటర్నీరీ స్టూడెంట్స్, గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. శనివారం బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించడానికి వచ్చిన మంత్రి సవితను నగరంలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో వెటర్నరీ వైద్య విద్యార్థులు కలిసి వినతిపత్రమందజేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ వైద్య విద్యార్థులకు …

Read More »