Breaking News

Daily Archives: February 22, 2025

మిర్చి రైతులను అదుకుంటాం….దీనికి వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలి

-క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు -కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు -కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్‌ల రవాణాకు అనుమతులు -గుంటూరు మార్కెట్ యార్డులో లారీ యజమానుల తీరుపై రైతుల ఫిర్యాదు..చర్యలకు సీఎం ఆదేశం -గుంటూరులోని స్పైస్ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రెండున్నర గంటలపాటు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, కమిషన్ ఏజెంట్లు, అధికారులతో సీఎం సమావేశం అమరావతి, …

Read More »

కుంభమేళాలో పుణ్యస్నానం అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవం

-పులకించి పోయాను -ఈ ఆధ్యాత్మిక అనుభవం అనిర్వచనీయం -వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం యుపిలో కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం నాడు ఆయన ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానమాచరించారు. ఈ పవిత్ర స్నానం తనకు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంతో పులకింప చేసిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్నానం …

Read More »

శ్రీ భవాని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈనెల 25 వరకు ఉచిత యురాలజీ వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పోరేట్ వైధ్య సేవలు అందరికి అందుబాటులోకి తీసుకురావలనే ఆశయానికి అణుగుణంగా శ్రీ భవాని హాస్పిటల్లో ఈ నెల 21 తేదీ నుంచి 25వ తేదీ వరకు యురాలజీ వైధ్య సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నామని శ్రీభవాని మల్టి స్పెషాలిటీ హస్పటల్ ఛీఫ్ ఆడ్మీనిస్ట్రేటర్ డాక్టర్ దిలీప్ తెలిపారు. 15 తేధినుండి నిర్వహిస్తున్న ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని శ్రీ భవాని హాస్పిటల్ కి చెందిన ఆయన తెలియజేశారు. శనివారం సాయంత్రం భవానీపురంలోని శ్రీ భవాని …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..

– 224 మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు – సిబ్బందికి రెండు ద‌శ‌ల్లో పూర్తిస్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు – 112 పోలింగ్ స్టేష‌న్ల‌కు మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న జ‌రిగే కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్‌టీఆర్ జిల్లాస్థాయిలో ప‌టిష్ట ఏర్పాట్లు చేశామని.. ఇప్ప‌టికే 224 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో)కు రెండుద‌శ‌ల్లో …

Read More »

నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టెందుకు నియోజకవర్గం పోల్ మేనేజ్ మెంట్ సభ్యులతో గద్దె క్రాంతికుమార్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు వెలగపూడి శంకర్ బాబులు హాజరై సభ్యులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం పట్టభధ్రులు …

Read More »

రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరందిస్తాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -‘రైతు బడి- అగ్రి షో’ను ప్రారంభించిన మంత్రి -సాగులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు -రాయలసీమకు కృష్ణా జలాల తీసుకొచ్చిన ఘనత టీడీపీదే -వ్యవసాయంలోకి యువత రావాలి -రైతు ద్రోహి జగన్ : మంత్రి సవిత ఫైర్ అనంతపురం /రాప్తాడు,  నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయంలో సాంకేతిక వినియోగంతో అధిక దిగుబడులు సాధించొచ్చునని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సాగులో సాంకేతికకు …

Read More »

సిపిఎస్ ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేయాలి… : భూపతిరాజు రవీంద్ర రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగులకి ఇవ్వాల్సినపాత బకాయిలు డి ఎ, ఐ ఆర్, పిఆర్సి కమిటీ పై సోమవారం నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాలులో ఉద్యోగులకు ప్రయోజనాలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల డి ఏ లకు సంబంధించి పాత బకాయిలు, సరెండర్ లీవ్స్ కి సంబంధించి బకాయిలు, ఏపీ జి ఐ ఎల్, మెచ్యూర్ బాండ్స్ కి సంబంధించి బకాయిలు సోమవారం నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి నిధులు …

Read More »

అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు.

Read More »

ఆవిష్కరణలతోనే ఆహారకొరత పరిష్కారం

-పి.బి.సిద్ధార్థ ఆర్థికసదస్సులో ఆచార్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న జనాభాకి తగిన నిష్పత్తిలో భూవిస్తీర్ణం పెరగదని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంటల విస్తీర్ణం పెంచుకొని ఆహారకొరతను అధిగమించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ఆచార్యులు డాక్టర్ సి.ఎస్.ఎన్.రాజు అన్నారు. శనివారం ఉదయం విజయవాడలోని పి.బి సిద్ధార్థ కళాశాల ఆర్ధికశాస్త్ర విభాగం జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఇతర సాంకేతికత ద్వారా డ్రాగన్ ఫ్రూట్స్ తరహా నూతన ఫలాలు మరిన్ని కనుగొనాల్సి ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు ఆవిష్కరణలు దోహదపడతాయని …

Read More »

మేరీస్ స్టెల్లా కళాశాల 63 వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరీస్ స్టెల్లా కళాశాల 63 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాద్రస్ మాట్లాడుతూ తమ కళాశాల విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది అని తెలిపారు కళాశాల వార్షిక నివేదికలో కళాశాల విద్యార్థినులు ప్రగతి నీ కొనియాడారు. కరస్పాండెంట్ డాక్టర్ లేన క్వాడ్రస్ శుభ కాంక్షలు తెలిపారు. గౌరవ అతిథి గా స్వరూప రాణి ఎలీప్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలలో రాణించాలని తాను కూడా …

Read More »