విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటుచేసిన కూటమి నాయకుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కూటమి ముఖ్య నేతలతో భేటీ అయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులతో చర్చించారు. నాయకులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం …
Read More »Daily Archives: February 5, 2025
నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పిల్లల్లోని నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో వైద్య, విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపాన్ని అధికమించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజున ఒకటి నుండి 19 సంవత్సరాల …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, మత్స్య, పశుసంవర్ధక, విద్య తదితర శాఖల …
Read More »ఈట్ స్ట్రీట్ లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించండి…
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామల రోడ్, ఈట్ స్ట్రీట్, సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ లో పారిశుద్ధ్య నిర్వహణ లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రజలు ఆహారం సేవించే ప్రదేశమైనందున ఎల్లప్పుడు అధికారులు …
Read More »అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు సత్వరమే పూర్తి చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రెడ్ సర్కిల్, మధురానగర్ గుణదల సెంటర్, గుణదల రైల్వే స్టేషన్, న్యూ రాజరాజేశ్వరి పేట, కొత్త వంతెన ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ వద్ద పర్యటించి, జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్ …
Read More »మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానాన్ని బుధవారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ బాలాజీ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నాగ పుట్ట వద్ద పాలు పోసి, నాగపుట్ట పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు వేద …
Read More »అనాథ పిల్లలకు కొత్త జీవితాన్ని అందించండి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : ఏ అనాథ బిడ్డ తల్లిదండ్రులు, కుటుంబం లేకుండా ఉండకూడదు అని, అలాంటి పిల్లలకు కొత్త జీవితాన్ని అందించేందుకు సహృదయులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్లో శిశు గృహ మచిలీపట్నంలో ఉంటున్న బాలుడిని కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా జిల్లా బాలల రక్షణ విభాగం (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వాసులు నోటం రవి, ఉషా దంపతులకు …
Read More »రోగుల సంతృప్తే సేవలకు ప్రాతిపదిక
-సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేటర్లు సమన్వయంతో పనిచేయాలి -30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మరింత పటిష్టంగా అమలు చేయాలి -ఏపీ సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల విషయంలో రోగులు సంతృప్తి చెందడమే ప్రాతిపదికగా డాక్టర్లు పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో(జిజిహెచ్‌లు) సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేటర్లు సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాల్ని సాధించగలుగుతారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిజిహెచ్‌ల …
Read More »అప్లికేషన్ గడువు పొడిగింపు
–ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ -మచిలీపట్నం, వుయ్యూరులో పర్యటన -ఐడి లిక్కర్ పై కఠిన చర్యలు మచిలీపట్నంనేటి పత్రిక ప్రజావార్త : ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మచిలీపట్నం, వుయ్యూరు ఎక్సైజ్ స్టేషన్లను సందర్శించి అప్లికేషన్ ప్రక్రియ, ఎక్సైజ్ నేరాలు తదితర అంశాలపై సమీక్షించారు. పర్యటన సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఐడి లిక్కర్‌ను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని, అక్రమ మద్యం వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. నవోదయం 2.0 ని కఠినంగా అమలు చేయాలని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనులు నిర్వహించాలన్నారు. అప్లికేషన్ దాఖలుకు …
Read More »చట్టపరిధిలోబడి సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రీసర్వే సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జయలక్ష్మి
-విజయవంతగా రీసర్వే డిప్యూటీ తాహసీల్దార్ ల రాష్ట్ర స్దాయి శిక్షణ, సమీక్ష సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చట్టపరిధికి లోబడి సహజ న్యాయ సూత్రాలను అన్వయిస్తూ రీసర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయలక్ష్మి స్పష్టం చేసారు. గతంలో జరిగిన తప్పిదాలను అధికమిస్తూ సజావుగా రీసర్వే వ్యవహారాలను పూర్తి చేయాలని సూచించారు. బుధవారం గుంటూరు నాగార్జునా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్దాయి రీసర్వే డిప్యూటీ తాహసీల్దార్ శిక్షణ, సమీక్ష కార్యక్రమానికి సిసిఎల్ఎ ఛీప్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. …
Read More »