అప్లికేషన్ గడువు పొడిగింపు

ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్
-మచిలీపట్నం, వుయ్యూరులో పర్యటన
-ఐడి లిక్కర్ పై కఠిన చర్యలు

మచిలీపట్నంనేటి పత్రిక ప్రజావార్త :
ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మచిలీపట్నం, వుయ్యూరు ఎక్సైజ్ స్టేషన్లను సందర్శించి అప్లికేషన్ ప్రక్రియ, ఎక్సైజ్ నేరాలు తదితర అంశాలపై సమీక్షించారు. పర్యటన సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఐడి లిక్కర్‌ను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని, అక్రమ మద్యం వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. నవోదయం 2.0 ని కఠినంగా అమలు చేయాలని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనులు నిర్వహించాలన్నారు. అప్లికేషన్ దాఖలుకు మరింత సమయం కల్పించేందుకు గడువును ఫిబ్రవరి 8 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వుయ్యూరు ఎక్సైజ్ స్టేషన్ లో అప్లికెంట్లతో నిశాంత్ కుమార్ మాట్లాడి, ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని విచారించారు. అప్లికెంట్లు సులభమైన అప్లికేషన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎక్సైజ్ శాఖ కార్యశైలిని అభినందించారు. మరోవైపు, “బైండ్ ఓవర్” విధించిన వ్యక్తుల విషయంలో కఠిన ఆదేశాలు జారీ చేశారు. తిరిగి నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటే, రెవిన్యూ అధికారులతో కలిసి వారిపై వేసిన బాండ్ మొత్తాన్ని వసూలు చేయాలని, తద్వారా నేరస్థుల్లో చట్టం పట్ల భయం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా నిశాంత్ కుమార్ తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు, పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అధికారులు ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో సక్రమ చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *