Breaking News

Daily Archives: February 10, 2025

బేతు రామ్మోహన్ మరణం కాపులకు తీరనిలోటు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాపు నాయకులు బేతు రామ్మోహన్ మరణం కాపులకు తీరనిలోటని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దశరధ రామిరెడ్డి అన్నారు. మహా కుంభమేళా కు వెళ్ళి గుండె పోటుతో అకాల మరణం చెందడం తీవ్రంగా కలచివేసింద న్నారు. ఈ సందర్భంగా బేతు రామ్మోహన్ సంతాప సభ సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ మేరకు ఆల్ ఇండియా జైహింద్ పార్టీ జాతీయ అధ్యక్షులు దశరధ రామిరెడ్డి మాట్లాడుతూ కాపునాడు జిల్లా …

Read More »

సత్యనారాయణపురంలో కోవెల జ్యూయలరీ షోరూమ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సత్యనారాయణపురంలో ప్రప్రదమంగా కోవెల జ్యూయలరీ షోరూమ్ ను నూతనంగా నెలకొల్పారు. సోమవారం ఈ షోరూమ్ ను హరిహరవీరమల్లు ఫేం నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి,కోవెల జ్యూయలరీ షోరూమ్ నిర్వాహకులు రమేష్ దంపతులకు ఆశీర్వచనాలను అందచేశారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ షోరూంను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ లాంఛనంగా ప్రారంభించి షోరూమ్ …

Read More »

డేటా అనుసంధానం వేగ‌వంతం చేయాలి

-శాంతిభ‌ద్ర‌త‌ల పరిరక్షణకు సీసీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించండి -వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశీలించండి -ఆర్టీజీఎస్‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య డేటా అనుసంధాన‌ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో సోమ‌వారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ..అన్ని శాఖ‌ల మ‌ధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎస్‌తో …

Read More »

స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి

-ఆహార అలవాట్లు మారాయి….అగ్రికల్చర్ స్థానంలో హార్టికర్చల్ వచ్చేస్తోంది -హార్టికల్చర్ సాగుకు, ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలి -రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదు…దీనికోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి -ఎంఎస్ఎఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసింది…బ్యాంకులు సహకరించాలి -గత ప్రభుత్వ అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి -పిఎం సూర్యఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యం -ఎస్ఎల్ బిసి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర …

Read More »

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.బాపిరెడ్డి, ప్రధాన అర్చకులు అందించారు. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ …

Read More »

అన్నక్యాంటీన్‌కు రూ.6 లక్షల విరాళం

-సీఎంను కలిసి చెక్కు అందించిన రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్‌కు ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేష్ ప్రతినిధులు విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి రూ.6,66,666ల చెక్కును అందించారు. పేదవాడు పస్తులుండకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌లకు విరాళాలు ఇచ్చి దాతృత్వం చాటుకున్న అసోసియేషన్ ప్రతినిధులను సీఎం అభినందించారు. చెక్కు అందించిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ జి.పట్టాభిరామారావు, వై.కుమారస్వామి, సెక్రటరీ సాంబశివరావు, ట్రెజరర్ ఎస్ఎస్ఆర్ …

Read More »

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నఅయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణ రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హాలులో ఎమ్మెల్యేల కోసం నిర్వహించనున్న ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించవలసిందిగా ఆయనను కోరారు. ఓరియెంటేషన్ కార్యక్రమం మొదటి రోజు ప్రారంభోత్సవానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. రెండో రోజు …

Read More »

ఎస్పీకి లారీ ఓనర్స్ వినతిపత్రం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల సందర్భంగా సీజ్ చేసిన వాహనాలను పోలీసుస్టేషన్ల నుండి విడుదలచేసే విషయమై విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్. గంగాధరరావును మచిలీపట్నంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏదైనా రోడ్డుప్రమాదం జరిగినపుడు వాహనాల రికార్డులు పరిశీలించి సక్రమంగా ఉంటే పోలీస్ స్టేషన్ లో డ్రైవరుకు బెయిల్ ఇచ్చి వాహనం విడుదల చేయాలని గతంలో డీజీపీ జారీచేసిన ఉత్తర్వులు చల్లపల్లి పోలీస్ స్టేషనులో అమలు కావడం …

Read More »

అమెరికాలో చేనేత ఎక్స్ పోలు

-మంత్రి సవితతో చికాగో ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను అమెరికాలోని చికాగో రాష్ట్ర ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ లో చికాగో లో పురుడ్యూ యూనివర్శిటీ, జీఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జీఎస్ఏ గ్లోబల్ మిల్లిట్స్ ఎక్స్ పో లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి సవితకు చికాగో ప్రభుత్వ ప్రతినిధి లా షాన్ కె.ఫోర్డ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కలిగి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర- స్వచ్ఛతహే సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మచిలీపట్నం రూరల్ ఎస్ఎన్ గొల్లపాలెం, అరిశేపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలకు ఎటువంటి వ్యాధులు సంక్రమించవన్నారు. పొడి తడి చెత్త వేరు చేసే …

Read More »