Breaking News

Daily Archives: February 14, 2025

మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ద్రవిడ వారస ప్రతీకగా, శ్రీ శక్తి నిలయంగా ఆదిదంపతులైన శివపార్వతులే శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సుందరేశ్వర స్వామి వార్లుగా వెలసిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న దక్షిణ భారతదేశంలోని అత్యంత అపురూపమైన దేవాలయంగా పరిగణించే మధురై పట్టణంలోని శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సోమసుందరేశ్వన్ వార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్  శ్రీ మీనాక్షి సోమ సుందరేశ్వరన్ లకు ప్రత్యేక …

Read More »

తిరుపరంకుండ్రం శ్రీ మురుగన్ సేవలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

– షష్ట షణ్ముఖ క్షేత్రాల పర్యటనలో భాగంగా తిరుపరంకుండ్రం క్షేత్రం సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శివుడు, విష్ణువు అభిముఖంగా శ్రీవల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు వెలిసిన తిరుపరంకుండ్రం దివ్య క్షేత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శ్రీ దుర్గా శక్తితో పాటు సోదరుడైన శ్రీ సత్య గణపతి స్వామి వారి చెంతనే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు వెలసి భక్తులను కటాక్షిస్తారు. దక్షిణ భారతదేశ దేవాలయాల పర్యటనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టిన …

Read More »

పళని నుంచి తిరుమలకి వచ్చే భక్తులకి రవాణా సౌకర్యంపై దృష్టిపెడతాం

-పళనిలో మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -పళని శ్రీ అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : జ్ఞానం సర్వసిరుల మూలం. విశ్వాన్ని చుట్టి వచ్చే విషయంలో తన సోదరుడు శ్రీ విఘ్నేశ్వరుడి చేతిలో ఓడి జ్ఞాన సంపన్నత కోసం ఆది దంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యుడు భూమికి వచ్చారు. జ్ఞాన సముపార్జన కోసం వచ్చిన స్వామి పళని కొండపై వెలిశారు అని చెబుతారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమే పళని …

Read More »

బీసీ విద్యార్ధుల డైట్ బకాయిలు చెల్లించండి

-నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలు రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ -సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం -అవసరమైన మేర మరిన్ని దోభీఘాట్ల నిర్మాణం -బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ …

Read More »

స్వచ్చాంధ్ర మిషన్ లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి

-పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలి -స్వచ్చాంధ్ర అనేది ఒక వ్యక్తికో, ఒక సంస్ధకో చెందిన కార్యక్రమం కాదు -పిసిబి గాలి నాణ్యతను పరిశీలించాలి… నెట్ జీరో కార్యక్రమాలు అమలు చేయాలి -స్వచ్చాంధ్ర కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష -14 ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు… మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా… చివరి స్ధానంలో అల్లూరి జిల్లా అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని …

Read More »

సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యం లో క్రీడాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు

-డిల్లీ పర్యటనలో రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -కేంద్ర కార్మిక ఉపాధి క్రీడ యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి -ఏప్రిల్ నెలలో ఏపిలో పర్యటించనున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ -రాష్ట్రంలో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి మద్దతు కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. -రాష్ట్రంలో అన్ని నగరాలలో క్రీడ మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ 280.9 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ …

Read More »

దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం చంద్రబాబు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టాత్మక ఇండియా టుడే పత్రిక సర్వేలో చంద్రబాబు నాయుడు నాలుగో స్థానంలో నిలవడం మాకు గర్వకారణం. కేవలం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఐదో స్థానం నుంచి ఆయన నాలుగో స్థానానికి చేరుకోవడం సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ, ప్రగతి సాధించడానికి పట్టుదలతో పనిచేస్తున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం కొన్ని నెలల కాలంలోనే …

Read More »

యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

-యాసిడ్ దాడికి గురైన మహిళకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తాం -యాసిడ్ దాడులను సహించేది లేదు -కేవలం 15 నిమిషాల్లోనే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది -యాసిడ్ దాడి సంఘటనపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ -రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మదనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గుర్రంకొండ మండలం, ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన గణేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని …

Read More »

పీలేరులో యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

-నిందితునిపై కఠిన చర్యలకు ఆదేశం అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Read More »

ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిజాయితీ, నిరాడంబరత్వం, ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య జాతికి చేసిన …

Read More »