Breaking News

Daily Archives: February 10, 2025

పిల్లలకు ఉచిత నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రక్తహీనతకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యకర జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. “జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం”(డివార్మింగ్ డే)సందర్భంగా సోమవారం నగరంలోని పోర్ట్ రోడ్ లోని ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల 49వేలకు పైగా పిల్లలకు ఉచిత నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. …

Read More »

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందలి పద్మావతి పురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాది కారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అధ్యక్షతన విద్యార్థులు అందరికీ డీ-వార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ నులిపురుగుల మాత్రలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు ప్రసంగిస్తు జిల్లా లో 4,91,714 మంది విద్యార్థులకు 6542 కేంద్రాలలో ఈ రోజు కడుపు లో ప్రేవుల లో ఉన్న …

Read More »

విద్యార్థులు చిన్న‌నాటి నుంచే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌ర‌చుకోవాలి

-యూబీఐ డిప్యూటీ రీజ‌న‌ల్ హెడ్ హ‌రీష్ బేతా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పరీక్షల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విద్యార్థుల‌తో నిర్వ‌హించిన ప‌రీక్షా పే చ‌ర్చ – 2025 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార ప్రదర్శనను సోమవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) విజ‌య‌వాడ ప్రాంతీయ కార్యాల‌యం విజయవాడ, ప్రసాదంపాడులోని వివేకానంద ఇంగ్లిష్ మీడియం పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి భారతదేశంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల‌తో సంభాషించారు. పరీక్షలకు …

Read More »

1/70 పై ఏజెన్సీ బంద్‌కు సిపిఐ (యం) మద్ధతు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1/70 చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 11,12 తేదీలలో జరుగుతున్న ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్దతు తెలియజేస్తున్నది. 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్‌ వ్యాఖ్యలపై గిరిజనుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ తన వైఖరిని స్పష్టం చేయకపోవడం వల్ల గిరిజనుల్లో ఇంకా ఆందోళన పెరుగుతోంది. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాలని డిమండ్‌ చేస్తున్నది. బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని …

Read More »

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ

-పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్  పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారణ. -బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలి. -ప్రజలు కొన్ని రోజులు పాటు  చికెన్ తినడం తగ్గించాలి. -కలెక్టరేట్లో కమెండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తో 95429 08025 ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా 10 …

Read More »

ఆలపాటి విజయానికి ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు

-ఫారూఖ్ షిబ్లి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్న సందర్బముగా వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్, సమతా సైనిక్ దల్, LIC ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, విద్యుత్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం, ఇన్కమ్ టాక్స్ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం నాయకులతో …

Read More »

ప్రగతికి ఓటు వేద్దాం…ప్రభుత్వంతో కలిసి నడుద్దాం…

-ఆలపాటి రాజాను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి -ఆలపాటి రాజాతో కలిసి తూర్పులో విస్త్రత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె క్రాంతికుమార్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యావంతుడు, సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటుగా న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా అనుభవంతో పాటుగా విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపోందించుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆర్ట్స్ కాలేజీ, …

Read More »

పి.బి.సిద్ధార్థ ఫిజిక్స్ శాఖ సింటిలా పోస్టర్ ఆవిష్కరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.బి. సిద్ధార్థ కళాశాల స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే సింటిలా 6.0 కార్యక్రమం పోస్టర్ ను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఐ.క్యు.ఎ.సి. కన్వీనర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫిజిక్స్ శాఖాధిపతి, సింటిలా సమన్వయకర్త డా. టి. శ్రీనివాసకృష్ణ, భౌతికశాస్త్ర అధ్యాపకులు టి.పూజిత, డా. ఎస్కే ముస్వరీన్, జె.పాండురంగారావు, ఎన్.రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింటిలా కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల …

Read More »

పి.బి.సిద్ధార్థలో డేటా సైన్స్ హబ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏ.ఐ. హబ్ పేరుతో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం కళాశాల వెబినార్ హాలులో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, సిద్ధార్థ అకాడమీ విద్యాసలహాదారులు డాక్టర్ ఎల్.కె. మోహనరావు, ఐ.క్యు.ఎ.సి. కన్వీనర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్లేస్ మెంట్ ఆఫీసర్ డా. శ్రీధర్, డేటా సైన్స్ శాఖాధిపతి డా.కొంపల్లి ఉదయశ్రీ జ్యోతిప్రకాశనం …

Read More »