తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందలి పద్మావతి పురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాది కారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అధ్యక్షతన విద్యార్థులు అందరికీ డీ-వార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ నులిపురుగుల మాత్రలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు ప్రసంగిస్తు జిల్లా లో 4,91,714 మంది విద్యార్థులకు 6542 కేంద్రాలలో ఈ రోజు కడుపు లో ప్రేవుల లో ఉన్న నులి పురుగులు నిర్మూలన కై ఆల్బండజోలు మాత్రలు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.విద్యార్థులలో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలపడం జరిగింది. అలాగే ఈరోజు గైర్హాజరైన పిల్లలకు 17వ తారీఖున మాప్ అప్ డే రోజున ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తారని తెలపడం అయినది. ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మందు బిళ్ళలను విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల యందు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు రక్తహీనత గురించి, పర్సనల్ హ్యాండ్ వాషింగ్ గురించి నులిపురుగుల నివారణ గురించి అలాగే బహిరంగ మల విసర్జన చేయరాదని అందరూ కూడా టాయిలెట్స్ వాడుకోవాలని తదితర విషయాలు పై ఆరోగ్య విద్య బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఇ ఓ శ్రీ బాలాజీ, ఆర్బిఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, దామినేడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉదయశ్రీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళి కృష్ణ, డిప్యూటీ డెమో లు భానుమూర్తి, కిరణ్ కుమార్ లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీమతి హరిప్రియ గారు ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొనడం జరిగింది
Prajavartha Online Telugu News