విద్యార్థులు చిన్న‌నాటి నుంచే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌ర‌చుకోవాలి

-యూబీఐ డిప్యూటీ రీజ‌న‌ల్ హెడ్ హ‌రీష్ బేతా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న పరీక్షల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విద్యార్థుల‌తో నిర్వ‌హించిన ప‌రీక్షా పే చ‌ర్చ – 2025 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార ప్రదర్శనను సోమవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) విజ‌య‌వాడ ప్రాంతీయ కార్యాల‌యం విజయవాడ, ప్రసాదంపాడులోని వివేకానంద ఇంగ్లిష్ మీడియం పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి భారతదేశంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల‌తో సంభాషించారు. పరీక్షలకు ముందు ఒత్తిడిని అధిగమించడానికి వారికి ప్రేరణాత్మక చిట్కాలను అందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిమితంగా ఉపయోగించడం, వాతావరణ మార్పులపై అవగాహన మరియు నాయకత్వ లక్షణాలపై కూడా ప్రధానమంత్రి విద్యార్థులకు సూచ‌న‌లిచ్చారు. పీఎం సంభాషణ తర్వాత వివేకానంద ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి యూబీఐ డిప్యూటీ రీజ‌న‌ల్ హెడ్ హ‌రీష్ బేతా మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ కెరీర్‌లో గౌర‌వ ప్రధాని సలహాలను పాటించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. విద్యార్థులు కూడా చిన్నతనం నుంచే పొదుపు అలవాటు, ఆర్థిక క్రమశిక్షణను అలవవ‌ర‌చుకోవాల‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *