Breaking News

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ

-పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్  పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారణ.
-బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలి.
-ప్రజలు కొన్ని రోజులు పాటు  చికెన్ తినడం తగ్గించాలి.
-కలెక్టరేట్లో కమెండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తో 95429 08025 ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు.

సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కార్యాచరణ పై కలెక్టర్ పి. ప్రశాంతి పోలీస్, రెవిన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్టు సమన్వయ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్షిస్తూ పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీ ల్లో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా పూణే ల్యాబ్ నిర్ధారించడం జరిగిందన్నారు. కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న ఆ ప్రాంతపు ప్రజలు, అధికారులు వెంటనే పశుసంవర్ధక శాఖ వెంటనే సమాచారాన్ని అందించాలన్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించిన వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయా పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), క్రోడిగుడ్లను కాల్చి వేయాలన్నారు. ఇప్పటికే 75 శాతం వాటిని కాల్చి వేయడం జరిగిందన్నారు. గడచిన ఐదు, ఆరు రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లు ను ఏ యే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయిన సమాచారం తెలుసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.

కానూరు గ్రామానికి ఎటువంటి బర్డ్స్ రాకుండా వెలుపలకి, బయటికి వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేయాలన్నారు. ఒక్కొక్క గ్రామానికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను, డిప్యూటీ తాసిల్దార్, ఆర్ ఐ లను నియమించామన్నారు. ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు.

కానూరు పరిధిలో 10 కిలోమీటర్ల లోపు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల్లో ఏమైనా బరల్డ్ ఫ్లూ లక్షణాల్లో ఉన్నది? లేనిది ? తెలుసుకొని వైద్య సహాయాన్ని అందించే విధంగా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి సూచించారు. అదేవిధంగా చికెన్ షాపులను గుర్తించి కొన్ని రోజులు షాపులను మూసివేయడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న వారికి వెంటనే వైద్య సహాయాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఎటువంటి లక్షణాలు ఉన్న వెంటనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు నెంబర్ కు 95429 08025 ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు జేయాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో డాక్టర్ భరత్ అందుబాటులో ఉంటారన్నారు.

వైరస్ ప్రబలకుండా ప్రతి మండలంలో ఇంటింటికి 2 శాతం సోడియం క్లోరైడ్ పిచికారి చేయాలన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు నిడదవోలు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు వైరస్ ప్రభలకొండ ముందస్తు కార్యాచరణను అమలు చేయాలన్నారు.

పౌల్ట్రీ యాజమానులు చనిపోయిన బర్డ్స్ ను కాలువల్లో విడిచి పెట్టవద్దని, వైరస్ నీటి ద్వారా చోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. క్రిమిసంహారక కోసం PPE మరియు శానిటైజేషన్ మెటీరియల్‌లతో పూర్తిగా అమర్చబడిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల (RRTలు) తగినంత సంఖ్యలో ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో రాపిడ్ టీమ్ లను నియమిస్తున్నామని, బర్న్ ఫ్లూ లక్షణాలు సంబంధించి ఎక్కడ నుంచి ఎటువంటి సమాచారం వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లే విధంగా స్పందించాలన్నారు.

జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లాలో వలస పక్షులు వివరాలు వాటి మరణాలతో కూడిన జాబితాను సిద్ధం చేయాలన్నారు.

రోజువారి నివేదిక  ప్రభుత్వానికి సమర్పించవలసి ఉన్నందున  విధులు నిర్వహించే సంబంధిత సమన్వయ అధికారులు  ప్రతిరోజు డేటాను సిద్ధం చేయాలన్నారు.

జిల్లాలో నల్లజర్ల, సీతానగరం మండలం మిట్టిపాడు లో కూడా పౌల్ట్రీ కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉన్నందున  అధికారులు ఆయా ప్రదేశాల్లో కూడా  ఒక కిలోమీటర్ రెడ్ జోన్ , 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్సు  జోన్ గా ప్రకటించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా  వైరస్ గతంలో కేరళ, గత ఏడాది నెల్లూరు జిల్లాలో నమోదు అయినట్లు తెలిపారు. మన జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున  అధికారులు వైరస్ వ్యాప్తి కాకుండా  నివారించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  ప్రతి గ్రామంలో ఆయా గ్రామపంచాయతీలు   ప్రజలకు అవగాహన కల్పించే విధంగా టామ్ టామ్ చేయించాలన్నారు.
జిల్లా అదనపు  ఎస్పీ ఏ.సుబ్బరాజు మాట్లాడుతూ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా  నియంత్రణ  పై ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పది కిలోమీటర్ల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్ పి. ఎ.సుబ్బరాజు, డి ఆర్ ఓ టి. సీతారామ మూర్తి, డి ఎంహెచ్ఓ డా. కె. వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, డిపిఓ వి. శాంతామణి, మున్సిపల్ అదనపు కమీషనర్, మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *