Breaking News

ప్రగతికి ఓటు వేద్దాం…ప్రభుత్వంతో కలిసి నడుద్దాం…

-ఆలపాటి రాజాను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి
-ఆలపాటి రాజాతో కలిసి తూర్పులో విస్త్రత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె క్రాంతికుమార్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యావంతుడు, సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటుగా న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా అనుభవంతో పాటుగా విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపోందించుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.
సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆర్ట్స్ కాలేజీ, ఎన్‌ఎస్‌ఎం స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని మైదానంలో ప్రచారం జరిగింది. మైదానంలో ఉన్న వాకర్స్‌ను కలసి ఈ నెల 27వ తేది జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మొదటి ప్రాధాన్యతా ఓటును వేయాల్సిందిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె క్రాంతికుమార్‌ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విద్యార్థి దశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన వెంటనే టీడీపీలో చేరారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు. న్యాయవాది కూడా కావడంతో ఏదైనా అంశంపై పూర్తి స్థాయి అవగాహనతో మాట్లాడటం ఆలపాటి రాజా సొంతమని చెప్పారు. శాసనసభలో ఏదైనా అంశం గురించి ఆలపాటి రాజా మాట్లాడితే అందరూ ఆ విషయాన్ని అంగీకరించే విధంగా ఉండేదన్నారు. అంతటి రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజాను ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు.
ఎమ్మెల్యీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటి చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ప్రగతికి ఓటు వేసి ప్రభుత్వంతో కలిసి నడుద్దామని పట్టభద్రుల, స్థానికుల సహకారం కోసం తాను ప్రచారం చేస్తున్నానన్నారు. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేదే ప్రభుత్వ ఆలోచన, సంకల్పమని అన్నారు. అక్షరమాలలోనే కాకుండా అభివృద్థిలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళాతామన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎవరైనా ప్రగతికి ఓటు వేసి మద్దతు ఇవ్వాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదు సంవత్సరాల పాలనలో సమాజాన్ని సర్వనాశనం చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జాస్తి సాంబశివరావు చెన్నుపాటి ఉషారాణి, చెన్నుపాటి గాంధీ , వీరంకి డాంగేకుమారి, గరికిపాటి శ్రీనివాస్‌ బద్రీ, వీరంకి సుబ్బారావు, కాకుమల్లిఖార్జున్ యాదవ్ , మల్లెల రామకృష్ణ , దండమూడి సన్నిది, షేక్ షరీఫ్ తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *