Breaking News

Daily Archives: February 10, 2025

జాతీయ క్రీడలు స్విమ్మింగ్ విభాగంలో బంగారు పతక విజేత గాయత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్రీడలు స్విమ్మింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల నాగిడి గాయత్రీ ని అభినందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. సోమవారం కలెక్టరేట్ చాంబర్లో బంగారు పతక విజేత గాయత్రిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఘనంగా సత్కరించారు. రాష్ట్రానికి, జిల్లాకు గ్రామానికి పేరు తెచ్చిన గాయత్రిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జనవరి 28 నుంచి ఈనెల 14 వరకు జరుగుతున్న 38 వ జాతీయ స్థాయి …

Read More »

పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరు పైన ఉంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరు పైన ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక కలెక్టరేట్ చాంబర్లో సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అధ్యక్షతన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు సభ్యులుగా ఉన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలల రక్షణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మండల గ్రామస్థాయిలోనూ …

Read More »

పదవ తరగతి పరీక్షలను ప్రగడ్బందీగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి పరీక్షలను ప్రగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మార్చి 17 తేదీ నుండి నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 22,341 మంది అభ్యర్థులు హాజరుకానున్నార న్నారు. పరీక్షలు నిర్వహణకు 145 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 145 మంది చీఫ్ సూపర్డెంట్లు …

Read More »

‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్, వేద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వై.శేష సాయి, వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్ పర్సన్ యడ్లపాటి శిరీష రాణి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ సెంట్రల్‌ అధ్యక్షుడు మనోజ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు …

Read More »

శ‌త‌శాతం రెవెన్యూ అర్జీల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాలి..

– ఇప్ప‌టికే పూర్త‌యిన 96 శాతం పీజీఆర్ఎస్‌-రెవెన్యూ స‌ద‌స్సుల అర్జీల ప‌రిష్కారం – మిగిలిన 4 శాతం అర్జీల ప‌రిష్కారానికి క్షేత్ర‌స్థాయి అధికారులు కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో న‌మోదైన ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్ట‌మ్ (పీజీఆర్ఎస్) రెవెన్యూ అర్జీల‌తో పాటు రెవెన్యూ స‌ద‌స్సుల్లో మొత్తం 4,832 పిటిషన్లు రాగా ఇప్ప‌టివ‌ర‌కు 4,637 (96 శాతం) మేర ప‌రిష్కారం పూర్త‌యింద‌ని, మిగిలిన నాలుగు శాతం అర్జీల‌పైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టి నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను …

Read More »

శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా వి.కరుణ, ఐ.ఏ.ఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన వి. కరుణ , ఐ.ఏ.ఎస్ సోమవారం మధ్యాహ్నం కలక్టరేట్ ను సందర్శించారు. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ గారు ఎన్నికల పరిశీలకుల వారికి పుష్పగుచ్చం అందించి నామినేషన్ల స్వీకరణ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ సందర్భంగా వివరించారు.

Read More »

మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC) పర్యవేక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్ధులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకునేందుకు అనుమతులు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (MCMC) నుండి పొందవలసి వుంటుంది. అభ్యర్డులు వారికి కావలసిన దరఖాస్తులను కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన MCMC నుండి పొందగలరు. రాజకీయ పార్టీల అభ్యర్ధులు ప్రీ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ …

Read More »

కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి

-ఆర్ ఎస్ ఆర్ కి క్షేత్ర స్థాయిలో కొలతలు సరిపోవాలి -నిర్దేశించుకున్న సమయపాలన లోగా రీ సర్వే పూర్తి చేయాలి -రీ సర్వే పూర్తి చేసే బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం తాళ్లపూడి సచివాలయం లో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , ఆర్డీవో రాణి సుస్మిత, సర్వే అధికారి తో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి …

Read More »

కోళ్ల మృత్యువాత ఘటనలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50వేల కోళ్లు మృత్యువాత పడ్డాయన్న ఘటనపై స్పందించిన మంత్రి దుర్గేష్ -కోళ్లకు వైరస్ సోకకుండా అధికార బృందం ముందు జాగ్రత్తలను చేపట్టిందని వెల్లడించిన మంత్రి దుర్గేష్ -గ్రామంలో, ఫౌల్ట్రీ సంబంధిత ప్రదేశాల్లో అధికారులు శానిటేషన్ ప్రక్రియ చేపట్టారని తెలిపిన మంత్రి -ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి దుర్గేష్ -కొన్నాళ్ల పాటు గ్రామస్థులు చికెన్, గుడ్లు తినవద్దని మంత్రి దుర్గేష్ సూచన -కానూరు అగ్రహారానికి 10 కి.మీ ల పరిధిలోని ప్రజలు …

Read More »

పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం వలన రక్త హీనత, పోషకాహారలోపం నివారించవచ్చు.

-జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పారంభించిన… -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని ప్రతి 6 నెలలకు ఒకసారి  నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం తాళ్లపూడి మండలం వేగేశ్వర పురం  కె ఎస్ ఆర్ జిల్లాపరిషత్ హై స్కూల్ నందు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాఠశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు …

Read More »