మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరు పైన ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక కలెక్టరేట్ చాంబర్లో సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అధ్యక్షతన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు సభ్యులుగా ఉన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలల రక్షణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మండల గ్రామస్థాయిలోనూ పిల్లల రక్షణ కమిటీలు ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని అన్నారు. ఆర్థిక పరిస్థితి కారణంగా పాఠశాలలో చదివించలేని తల్లితండ్రుల పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలన్నారు. కర్మాగారాల్లోనూ, షాపుల్లోనూ పనిచేస్తున్న తల్లిదండ్రులు వారి పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా పాఠశాలలో చేర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కులు, బాల్యవాహాలపై మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక అవగాహన క్యాంపులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిఇఓ పిఐజే రామారావు ,డిసిపిఓ మనీషా, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పణి ధూర్జటి, సిపిఓ గణేష్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఐసిడిఎస్ పిడి ఎం.యన్ రాణి, కమిటీ సభ్యులు ఉన్నారు.
Prajavartha Online Telugu News