Breaking News

జాతీయ క్రీడలు స్విమ్మింగ్ విభాగంలో బంగారు పతక విజేత గాయత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ క్రీడలు స్విమ్మింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల నాగిడి గాయత్రీ ని అభినందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. సోమవారం కలెక్టరేట్ చాంబర్లో బంగారు పతక విజేత గాయత్రిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఘనంగా సత్కరించారు. రాష్ట్రానికి, జిల్లాకు గ్రామానికి పేరు తెచ్చిన గాయత్రిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జనవరి 28 నుంచి ఈనెల 14 వరకు జరుగుతున్న 38 వ జాతీయ స్థాయి క్రీడలలో జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామ వాసి నాగిడి గాయత్రి స్విమ్మింగ్ మహిళల విభాగంలో అసమాన ప్రతిభను ప్రదర్శించి బంగారు పతకం సాధించడం పట్ల కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు.
అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాదించగల నైపుణ్యం ఉందని కొనియాడినారు. గాయత్రి కుటుంబ సభ్యులు జలక్రీడల పై ఉన్న ఆసక్తిని, మక్కువను అభినందించి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కే ఝాన్సీ లక్ష్మీ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *