Breaking News

పదవ తరగతి పరీక్షలను ప్రగడ్బందీగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పరీక్షలను ప్రగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మార్చి 17 తేదీ నుండి నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 22,341 మంది అభ్యర్థులు హాజరుకానున్నార న్నారు. పరీక్షలు నిర్వహణకు 145 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 145 మంది చీఫ్ సూపర్డెంట్లు పది మంది రూట్ ఆఫీసర్లు, 52 సిట్టింగ్ స్కాడ్, ఐదు ఫ్లైయింగ్ స్క్యాడ్ నియమించడం జరిగిందన్నారు. అభిషేకల అధికారులు సంబంధంతో ఏర్పాట్లు పూర్తిచేసి పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ కు అంతరాయం లేకుండా చూడాలని ఏపీ సిపిడిసిఎల్ అధికారులను ఆదేశించారు. పరిష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గూగుల్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, డిఇఓ పిఐ జె రామారావు, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *