Breaking News

మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC) పర్యవేక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్ధులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకునేందుకు అనుమతులు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (MCMC) నుండి పొందవలసి వుంటుంది. అభ్యర్డులు వారికి కావలసిన దరఖాస్తులను కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన MCMC నుండి పొందగలరు. రాజకీయ పార్టీల అభ్యర్ధులు ప్రీ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ పరిశీలించి నిర్ణీత గడువులోపు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా, ఈ పేపర్లు , అండ్ కేబుల్ నెట్‌వర్క్‌తో సహా టీవీ , రేడియో ఛానెల్‌లు , ఆడియో – వీడియో డిస్‌ప్లేలు , సినిమా హాళ్లు , ఇంటర్నెట్ ఆధారిత మీడియా , వెబ్‌సైట్‌ల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC) పర్యవేక్షణ చేస్తుంది.

దరఖాస్తుదారులకు సూచనలు :-
1. అప్లికేషన్లు రెండు సెట్లుగా సమర్పించవలెను. (ఇక్కడ లభిస్తాయి)
2. దరఖాస్తుతో పాటు ఎటాచ్ చేయవలసినవి

(ఎ) పాంప్లెట్, పేపర్ ప్రకటన, ఫ్లెక్స్, సోషల్ మీడియా స్లైడ్ ల కొరకు..
ప్రింటెడ్ ప్రూఫ్ కాపీ

(బి) టివి ప్రకటన, రేడియో ప్రకటన, పబ్లిక్ గా డిస్ ప్లే చేయు ప్రకటన, సోషల్ మీడియాలో ప్రసారం
చేయదలచిన ప్రకటనలు మొదలగు వీడియో ల కోరకు.

వీడియో తో కూడిన పెన్ డ్రైవ్ లేదా డివిడి. (దానిపై దరఖాస్తుదారుని పేరు, చిరునామా రాయాలి)
వీడియోలో వినియోగించిన స్క్రిప్టు పేపర్ ప్రింట్.
ఓకవేళ వీడియో సాంగ్స్ అయితే దాని తాలూకు సాహిత్యం పేపర్ ప్రింట్.

3. పైన పేర్కొన్న అటాచ్ మెంట్లన్నీ జతపరిచి, రెండు సెట్లుగా అప్లికేషన్లు సమర్పించి,
Akcnowledgement Number తీసుకోగలరు.

4. MCMC కమిటీ మీరు ఇచ్చిన దరఖాస్తులు CERTIFY చేసిన వెంటనే మీ మొబైల్ నంబరుకు TEXT
MESSAGE పంపబడుతుంది. ఒకవేళ మీరు సమర్పించిన ప్రకటనలో అభ్యంతరకమైన విషయాలు ఉండి,
మార్పులు చేయవలసి వచ్చినా కూడా మీకు TEXT MESSAGE పంపబడుతుంది. సదరు మెసేజ్ ను
చూపించి, FRONT DESK లో మీ సర్టిఫికెట్ ను లేదా దరఖాస్తును మీరు పొందవచ్చు.

5. మీ ప్రకటన సర్టిపై చేయటంపై, లేదా రిజెక్ట్ చేయటంపై MCMC CHAIRMAN వారిదే తుది నిర్ణయము.
దీనిపై వివరణ ఇవ్వదలచినచో, సదరు వివరణతో కవరింగ్ లెటర్ పెట్టి, తిరిగి దరఖాస్తు చేసుకోగలరు.

6. మీ దరఖాస్తు లో ఏ విధమైన మార్పులు చేర్పులు చేయవలెనని కమిటీ నిర్ణయించినచో, దానిపై కేవలం
లిఖిత పూర్వకంగా మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకోగలరు. FRONT DESK లో లేదా, MCMC
COMMITTEE MEMBERS వద్ద దీనిపై ఎటువంటి చర్చలు జరుపరాదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *