Breaking News

Daily Archives: February 10, 2025

ఐఏ అండ్ ఏడీ ఉద్యోగుల ఆనందోత్సాహాల నడుమ ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 ప్రారంభం

-మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన తొలి మ్యాచ్ లో ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల జట్టుపై కేరళ టీం విజయం -ఉత్కంఠంగా సాగిన రెండో మ్యాచ్ లో కర్ణాటక జట్టుపై గెలిచిన తమిళనాడు టీం -ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లు.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన యువ క్రీడాకారులు -ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహణ -విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో తొలిసారి నిర్వహిస్తోన్న …

Read More »

పేద‌ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ప‌టిష్ట నిఘా..

– అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా నిరంత‌ర త‌నిఖీలు – ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా పంపిణీ చేసే పేద‌ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ప‌టిష్ట నిఘా పెట్ట‌డం జ‌రిగింద‌ని.. ఎక్క‌డా అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌డుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి భ‌వానీపురంలో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడ‌బ్ల్యూసీ) గోదామును …

Read More »

ఎపిలో గ‌త ఐదేళ్ల‌లో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) ఏర్పాటు -ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నైపుణ్య లోటు అధ్య‌య‌నాలు

-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత) శాఖ స‌హాయ మంత్రి జయంత్ చౌధరీ వెల్ల‌డి -ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నైపుణ్య లోటు అధ్యయనాల (Skill Gap Studies) పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఎన్.ఎస్.డి.సి) ఆధ్వ‌ర్యంలో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) స్థాపించ‌టం జ‌రిగింది. 2019 నుండి ఈ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఎపిలో పలు పరిశ్రమల అవసరాన్ని బట్టి నైపుణ్య లోటు …

Read More »

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు మనదే

– ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి – ప్రతి ఓటరుని కలవాలి.. ఓటు వేయించాలి – సీటు త్యాగం చేసిన ఆలపాటికి ఎమ్మెల్సీని బహుమతిగా ఇద్దాం – ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల సమయంలో అధినేత మాటకు గౌరవమిచ్చి సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారెకి ఎమ్మెల్సీ సీటును బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ …

Read More »

వీడియో సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల వ్యయ నియంత్రణ బృందాలను ఆదేశించారు. కృష్ణా- గుంటూరు శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ (మీకోసం) గ్రీవెన్స్ హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సీ టీమ్స్ (ఎస్ఎస్ టి), వీడియో సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ …

Read More »

పటిష్ట ప్రణాళికతో ఎన్నిక నిర్వహణకు సిద్ధం కండి….

-ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల పై పూర్తి అవగాహన కలిగి ఉండండి….. -అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించండి…… -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గ ఎన్నికను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ నేపథ్యంలో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా …

Read More »

నులి పురుగులు.. మాన‌సిక వికాసానికీ నిరోధ‌కాలు

-ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపాలు ఏర్ప‌డ‌తాయి.. -అందుకే పిల్ల‌లు, కిశోర బాల‌లు అల్బెండ‌జోల్‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి -జాతీయ నులిపురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నులి పురుగులు పిల్ల‌లు, కిశోర బాల‌ల్లో ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందుకే అంద‌రూ అల్బెండ‌జోల్ మాత్ర‌ను తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం న‌గ‌రంలోని గ‌వ‌ర్న‌ర్‌పేట చుండూరు వెంక‌ట‌రెడ్డి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగిన జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. …

Read More »

ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యకరమైన ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులు లభిస్తాయి

-కలెక్టరేట్ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాల్ ను ప్రారంభించిన.. -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్ఫత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ పి..ప్రశాంతి సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాల్ ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావుతో కలిసి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ

-పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో బరల్డ్ బ్లూ శాంపిల్స్  పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారణ. -బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలి. -ప్రజలు కొన్ని రోజులు పాటు  చికెన్ తినడం తగ్గించాలి. -కలెక్టరేట్లో కమెండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తో 95429 08025 ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీల్లో బరల్డ్ బ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా …

Read More »

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎల్వో వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో  లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »