Breaking News

Daily Archives: February 5, 2025

ట్రాఫిక్ చట్టాలపై అవగాహన ఉండాలి… : డిటిసి ఎ మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతామని డిటిసి ఏ మోహన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు బుధవారం నాడు రవాణా, పోలీస్ శాఖలు బీమా కంపెనీలు, ఎన్జీవోస్ లతో ట్రాఫిక్ చట్టాలపై సెమినార్ డిటిసి ఏ మోహన్, డిసిపి (ట్రాఫిక్) విజయవాడ ఎం. కృష్ణ మూర్తి నాయుడు, ఎడిసిపి.ట్రాఫిక్ విజయవాడ ఎవిఎల్ ప్రసన్న కుమార్ నిర్వహించారు. ఈసందర్భంగా డిటిసి ఏ మోహన్ మాట్లాడుతూ …

Read More »

భారీ రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

-మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ సరుకు రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని నిబంధనలు పాటించకుండా భారీ వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామనిమోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ నారాయణరాజు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా బుధవారంనాడు జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ నందు భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎం వి ఐ నారాయణరాజు మాట్లాడుతూ …

Read More »

నగరంలో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి, పన్నుల వసూళ్ళలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులు మరియు ఆర్.ఐ ల పై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి, పన్నుల వసూళ్ళలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులు మరియు ఆర్.ఐ ల పై చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ హెచ్చరించారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ విభాగం అధికారులతో ఆస్తి పన్ను వసూళ్ళపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో తొలుతగా సచివాలయాల వారీగా ఉన్న డిమాండ్ మరియు వసూళ్ళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు …

Read More »

గుంటూరు నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్లు డ్రైన్ టు డ్రైన్ ఉండేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్లు డ్రైన్ టు డ్రైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్  ఏటి అగ్రహారం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇస్కాన్ గుడి రోడ్, పట్టాభిపురం, గోరంట్ల, ఇజ్రాయిల్ పేట, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు వెంటనే పనులను వేగంగా పూర్తి చేయాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ ద్వారా వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు వెంటనే పనులను వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్గారు కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. బుధవారం కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో తమ సమస్యలపై కమిషనర్ ని చాంబర్ లో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ కాంట్రాక్టర్ల వారీగా టెండర్ పొందిన పనులు, పెండింగ్ …

Read More »

అనధికార వ్యర్ధాల సేకరణ తక్షణం నిలిపివేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కమర్షియల్ సంస్థలు, చికెన్ స్టాల్స్ నుండి అనధికార వ్యర్ధాల సేకరణ తక్షణం నిలిపివేయాలని, ప్రతి కమర్షియల్ సంస్థ డి&ఓ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, రోడ్లు, డ్రైన్ ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ చేపట్టనున్న పలు చర్యలపై జిఎంసి ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు …

Read More »

పంట పొలాల్లో నీటి కుంటల‌తో.. పొలం ప‌చ్చ‌గా.. స‌మాజం సుభిక్షంగా..

– కార్య‌క్ర‌మం ఒక‌టే.. ప్ర‌యోజ‌నాలు అనేకం – రైతుల‌కు కార్య‌క్ర‌మం ప్రాధాన్య‌తను తెలియ‌జెప్పండి – ఒక రైతు.. ఒక నీటి కుంట నినాదంతో ముందుకెళ్లాలి – జిల్లా, క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంట పొలాల్లో నీటి కుంట‌ల (ఫార్మ్ పాండ్స్‌)తో పొలం ప‌చ్చ‌గా.. స‌మాజం సుభిక్షంగా ఉంటుందని, ఒక కార్య‌క్ర‌మంతో అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్ నుంచి జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి ఆర్‌డీవోలు, …

Read More »

విస్తృత త‌నిఖీల‌తో నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల్సిందే

– ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ప‌టిష్ట అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి – నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌కు చ‌ట్టప‌ర చ‌ర్య‌లు త‌ప్ప‌వు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ప‌టిష్ట అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని.. రేష‌న్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్ల‌ను అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీ చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. బుధ‌వారం ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ అమ‌లు తీరుతెన్నులు, చేప‌ట్టాల్సిన త‌నిఖీలు, ఉల్లంఘ‌న‌ల‌పై కేసుల న‌మోదు త‌దిత‌ర అంశాల‌పై పౌర స‌ర‌ఫ‌రాల …

Read More »