Breaking News

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు సత్వరమే పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రెడ్ సర్కిల్, మధురానగర్ గుణదల సెంటర్, గుణదల రైల్వే స్టేషన్, న్యూ రాజరాజేశ్వరి పేట, కొత్త వంతెన ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ వద్ద పర్యటించి, జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒక కోటి 99 లక్షల వ్యయంతో జరుగుతున్న యూజీడి కొత్త లైన్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యు జి డి పనులు చేసేటప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నీరు పొంగి బయటకి రాకుండా చర్యలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. తదుపరి కొత్త వంతెన వద్ద పాడైపోయిన మాన్ హోల్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మాన్ హోల్ ఎక్కడున్నా రోడ్ లెవెల్ కి సమానంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. తదుపరి రైల్వే, వివిధ శాఖల సమన్వయంతో రానున్న నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతాలైన మధుర నగర్, గుణదల సెంటర్, గుణదల రైల్వే స్టేషన్, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణమునకు విఎంసి తరఫున తీసుకోవాల్సిన చర్యలలో అధికారులు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *