ఈట్ స్ట్రీట్ లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించండి…

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామల రోడ్, ఈట్ స్ట్రీట్, సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ లో పారిశుద్ధ్య నిర్వహణ లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రజలు ఆహారం సేవించే ప్రదేశమైనందున ఎల్లప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని, దానికనుగుణంగా అక్కడున్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలిస్తూ, డిస్ ఇన్ఫెక్టంట్స్ వేసేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సింగ్ నగర్ అన్న కాంటీన్ పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, త్రాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు. నోడల్ ఆఫీసర్లు అందరూ తమ తమ అన్న క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్న వెంటనే సరి చేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారాలను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *