విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేరీస్ స్టెల్లా కళాశాల 63 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాద్రస్ మాట్లాడుతూ తమ కళాశాల విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది అని తెలిపారు కళాశాల వార్షిక నివేదికలో కళాశాల విద్యార్థినులు ప్రగతి నీ కొనియాడారు. కరస్పాండెంట్ డాక్టర్ లేన క్వాడ్రస్ శుభ కాంక్షలు తెలిపారు. గౌరవ అతిథి గా స్వరూప రాణి ఎలీప్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలలో రాణించాలని తాను కూడా ఈ కళాశాలలో చదువుకున్నాను అని మహిళలు మంచి పారిశ్రామికవేత్తలు గా ఎదగాలని మరియు కళాశాల లో విద్యార్థినీ గా తన అనుభవాలను పంచుకున్నారు. MLA గద్దె రామ మోహన్ రావు మాట్లాడుతూ తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలలో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది ఈ కళాశాల అని నేటి యువత జాబ్ మార్కెట్ కు అనుకూలమైన నైపుణ్యాలను పొందుకోవాలని భారతదేశం లో యువత నైపుణ్యాలు పెం పొందించుటకు విద్య వైద్య రంగాల్లో విశేష మైన నూతన కోర్సులు ప్రవేశ పెట్టడం వల్ల యువత కు ప్రయోజనం కలుగుతుందని వారు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు
ముఖ్య అతిథి పొట్లూరి భాస్కర రావు ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతూ విద్యార్థినులతో ఉత్సాహం ఉరకలు వేస్తుంది అని, టీచర్లు మరియు విద్యార్థినులు కృషి నీ కొనియాడారు. విద్యా అనేది సాధికారత కు అత్యంత ప్రధానమైన సాధనం అని మహిళల విద్యా కి ప్రధాన బాటలు వేస్తున్న కళాశాల స్టెల్లా కళాశాల అని కొనియాడారు చైల్డ్ కేర్, క్రీడలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ,ఆరోగ్య రంగాలు ఫైనాన్స్ రంగం లో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారని తెలిపారు ఉన్నత మైన కలలు కనలని ఎ టువంటి అవరోధాలు వచ్చిన ధైర్యం గా ఎదుర్కోవాలని తెలిపారు. అనంతరం సాంస్కృతిక పోటీలు అలరించాయి.
Prajavartha Online Telugu News