గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా అనధికార కట్టడాలు నిర్మాణం జరగకుండా ప్లానింగ్ కార్యదర్శులు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా వికాస్ నగర్, ఎస్విఎన్ కాలనీ, కొరెటేపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనధికార కట్టడాలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, క్షేత్ర స్థాయిలో ప్లానింగ్ కార్యదర్శులు, టిపిబిఓలు పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి కార్యదర్శి హ్యాండ్ బుక్ లేదా డైరీ మైంటైన్ చేయాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలో ప్రతి నిర్మాణం నిబందనల మేరకే జరగాలని, నిర్మాణం చేసుకునే వారు ప్లాన్ కి దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్గించాలన్నారు. అలాగే నిర్మాణం జరిగిన ప్రతి నిర్మాణంకు ఆస్తి పన్ను విధించేలా అడ్నిన్ కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలన్నారు. బహుళ అంతస్తు భవనాలకు కూడా ఓసి వచ్చే వరకు వేచి ఉండకుండా నివాసం ఉండే ప్లాట్ లకు పన్ను విధించాలని ఆదేశించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనల్లో అండర్ అసెస్మెంట్లు, అన్ అసెస్మెంట్లను గుర్తిస్తే సంబందిత అడ్మిన్ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఆర్ఓ మదన్ గోపాల్, ఏసిపి రెహ్మాన్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News