విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘మెస్సీయ ఫెలోషిప్’’ ఆధ్వర్యంలో దైవజనులు డాక్టర్ సజ్జా రత్నకుమార్ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం విజయవాడ స్థానిక ఆటోనగర్ గేట్ వద్ద 100 అడుగుల రోడ్డులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు డాక్టర్ సజ్జ రత్నకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మధ్యాహ్నానికి సుమారు 1,800 మంది పైగా పేషెంట్లు వారి వారి వ్యాధులను, నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వ్యాధులను బట్టి ఉచిత టెస్టులు, డాక్టర్ సలహాలు. చేయించుకుని మందులు ఉచితంగా తీసుకుని వెళ్లారని దైవజనులు సజ్జా రత్నకుమార్ తెలియజేశారు. రమేష్ హాస్పిటల్స్, క్యాపిటల్ హాస్పిటల్స్, మ్యాక్సీవిజన్ కంటి ఆసుపత్రి తదితర హాస్పిటల్స్ డాక్టర్స్, సిబ్బంది సహకారంతో మెగా క్యాంపు నిర్వహించామని ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని ఆ యేసయ్య మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని, అదంతా దైవము చేస్తున్న పనిగానే మేము భావిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత కంటి పరీక్షలు, బీపి, షుగర్, ఈ.సీ.జీ, 2డి ఎకో, తదితర పరీక్షలు, రూ. 200లకు థైరాయిడ్ టెస్ట్, ఉచితంగా గుండె, ఊపిరితిత్తులు, గ్యాస్ట్రో, ఆర్థో, దంత, కీళ్ళవ్యాధులు, గైనకాలజీ, న్యూరాలజీ, చెవి, ముక్కు, గొంతు ఇతర వ్యాధులను పరీక్షించి అవసరమైన సలహాలు తీసుకున్నారు. చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు మరియు ఇతర వ్యాధులను పరీక్షించి ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెస్సీయ ఫెలోషిప్ నిర్వాహకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News