Breaking News

అవినీతి పార్టీలకు చరమగీతం పాడారు

-ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో బీజేపీ అఖండ విజయం సాధించడంపై విజయవాడలో కూటమి నేతలు సంబరాలు చేసారు.. శనివారం భవానిపురంలోని శివాలయం సెంటర్ చౌరస్తాలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. బిజెపి జెండాలను పట్టుకొని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పెరిగిన అభివృద్ధి ఫలితంగానే ఢిల్లీలో భారీ మెజారిటీ సాధించడం జరిగింద న్నారు. అవినీతి పార్టీలైనటువంటి ఆమ్ ఆద్మీ, వైసిపి లకు ప్రజలు చరమగీతం పాడారన్నారు.
బీజేపీ విజయం ప్రతి ఒక్క కార్యకర్తదని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలు యేదుపాటి రామయ్య, భోగవల్లి శ్రీధర్, వేంపలి గౌరి శంకర్, మాదాల రమేష్, కోలపల్లి గణేష్, పైలా సురేష్,పోతిన భేసు కంటేశ్వరుడు, రెడ్డిపల్లి రాజు, సోమేశ్వరరావు, సత్యసాయి ఉమాకాంత్, పెద్దపల్లి స్వాతిరావు, సుమతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *