-జంతు, వృక్ష , జీవసాంకేతికశాస్త్ర విభాగాల మెగా ఈవెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాస్త్రవిజ్ఞానాన్ని యువతరంలో వ్యాప్తిచేయడానికి సీయన్షియా పేరుతో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలకు చెందిన వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవసాంకేతికశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఈ నెల 12న పి.బి.సిద్ధార్థ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, వృక్షశాస్త్రాధిపతి డాక్టర్ పువ్వాడ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కళాశాలలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల ఆవిష్కరించారు. సియన్షియా కోకన్వీనర్ డాక్టర్ సాంబానాయక్, అధ్యాపకులు డి.శ్రావణి, సిహెచ్. శిరీష, పి. లలితాప్రియాంక పాల్గొన్నారు. సియన్షియాలో భాగంగా ఈ నెల 12 న ఉదయం నుంచి సాయంత్రం వరకు క్విజ్, పి.పి.టి., పోస్టర్, అరుదైన జీవజాల సమాచార ప్రదర్శన, మిస్టర్ అండ్ మిస్ బయో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్, కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు.