Breaking News

గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేపటినుండి మూడు రోజులపాటు విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా జరగనున్న గుణదల మేరీమాత ఉత్సవాలకు పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో గుణదల మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలపరంగా మరియు ట్రాఫిక్ పరంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17 మంది డీఎస్పీలు, 44 మంది ఇన్స్పెక్టరలతో కలిపి సుమారు 1050 మంది సిబ్బందితో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డిసిపి గౌతమి షాలి ఐపీఎస్ గుణదల సమీపంలోని బిషప్ గ్రాసిస్ స్కూల్ గ్రౌండ్ క్లాసిక్ స్కూల్ గ్రౌండ్ నందు బందోబస్తు నిమిత్తం వచ్చిన అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ…… రేపటినుండి నుంచి నగరంలో గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా మేరీ మాత టెంపుల్ మరియు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్లతో ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహించాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రింది సిబ్బందికి సూచనలిస్తూ విధులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరితో నడుచుకుంటూ వారికి ఎలాంటి సౌకర్యం కలుగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిసిపి శ్రీ గౌతమి షాలి ఐపీఎస్ గారు, ట్రైనీ ఐపీఎస్ శ్రీ మనిషా గారు, ఏడీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *