-సుప్రీంకోర్టు న్యాయమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పలమనేరులో రూ.15.18 కోట్ల తో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాలను మరియు జడ్జిల నివాస భవన సముదాయాన్ని ప్రారంభోత్సవం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్. పలమనేరు,ఫిబ్రవరి 08: చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు. శనివారం పలమనేరు బెంగళూరు రోడ్డులో రూ.15.18 కోట్లతో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాల సముదాయాన్ని మరియు నలుగురు జడ్జిల నివాస భవన సముదాయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు హైకోర్టు జడ్జి మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్, హైకోర్టు జస్టిస్ టి.సి.డి శేఖర్ లు,తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నకు విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్ పి మణికంఠ చందోలు,పుష్ప గుచ్ఛం తో స్వాగతం పలకగా . .పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.అనంతరం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం సర్వమత ప్రార్థనలు చేసిన నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మదనపల్లి వాసిగా జిల్లాతో,ఉమ్మడి చిత్తూరు లోని పలు న్యాయవాదులతో సత్సంబంధాలు కలిగి ఉన్నానన్నారు. గతంలో వృత్తి రీత్యా మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే సమయంలో పలమనేరు మీదు గా ప్రయాణం చేయవలసి ఉండేదన్నారు.ఆంధ్రప్రదేశ్, కేరళ హైకోర్ట్ లాంటి పలు న్యాయస్థానాలప్రారంభోత్సవాల కార్యక్రమాలకు సుప్రీంకోర్టు కోర్టు జడ్జి హోదాలో హాజరు కావడం జరిగిందన్నారు. పలమనేరులో మెరుగైన మౌలిక సదుపాయాలతో న్యాయస్థాన భవనం నిర్మించారన్నారు. న్యాయవాదులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి, ప్రజలకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగించడంలో భాగంగా స్వయంగా కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందన్నారు.సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం అందించి ప్రజలకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావ్, తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి గురునాథ్, చిత్తూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.పి.డి వెన్నెల, డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ భారతి, పలమనేరు సివిల్ జడ్జి ఆది నారాయణ, సివిల్ జడ్జి లిఖిత,స్పెషల్ మెజిస్ట్రేట్ రాధమ్మ,పలమనేరు ఆర్ డి ఓ భవానీ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారక నాథ రెడ్డి, పలమనేరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News