Breaking News

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్(ఆడిట్) గా బాధ్యతలు స్వీకరించిన శరత్ చతుర్వేది

-1994 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ కు చెందిన శరత్ చతుర్వేది
-ఇప్పటివరకు ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ అండ్ ఇ) ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) గా వ్యవహరించిన ఎస్. శాంతి ప్రియ
-శరత్ చతుర్వేదికి అభినందనలు తెలిపిన విజయవాడ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించుకొని, అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న 1994 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ కు చెందిన శరత్ చతుర్వేది 12 ఫిబ్రవరి, 2025 బుధవారం రోజు విజయవాడ మనోరమ హోటల్ పక్కన ఉన్న స్టాలిన్ బిల్డింగ్ లోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కోల్‌కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ గా, అంతకుముందు ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ విభాగంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్)-I గా పని చేశారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా, ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ ల్లో అకౌంటెంట్ జనరల్ (ఎ అండ్ ఇ)-II గా బాధ్యతలు నిర్వర్తించి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక డిప్యూటేషన్ ప్రాతిపదికన సుల్తానేట్ ఒమన్ లో నిఫుణుడిగా నియమితులై విశేషమైన సేవలు అందించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ అండ్ ఇ) ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) గా ఇన్‌ఛార్జ్‌గా ఎస్. శాంతిప్రియ వ్యవహరించారు. నేటి నుండి శరత్ చతుర్వేది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) గా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శరత్ చతుర్వేదికి అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *