Breaking News

అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతను క్రమ తప్పకుండా అధికారులు పరిశీలించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిధిలో గల ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యతను నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు క్రమ తప్పకుండా పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, హెచ్ బి కాలనీ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, హెచ్ బి కాలనీ లోగల అన్న క్యాంటీన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అన్న క్యాంటీన్లో అవసరమైన సదుపాయాల్లో ఎటువంటి మరమ్మతులు ఉన్న ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, కిచెన్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలని, నిరంతరాయంగా త్రాగునీటి ఉండాలని, వాడుక నీటి పైప్లైన్లలో ఎటువంటి లీకేజీ లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి. వి. జి. ఎస్. వి. ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్ ) పి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న‌ ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *