Breaking News

ఏపీ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వ పుర‌స్కారం

-30 సంవత్సరాల త‌ర్వాత‌ రాష్ట్రానికి బ‌హుమ‌తి
-రిప‌బ్లిక్‌డే పెరేడ్‌లో యావ‌త్ దేశాన్ని ఆక‌ట్టుకున్న శ‌క‌టం
-ఏటికొప్పాక బొమ్మల రాజ‌సానికి నెటిజ‌న్ల ఫిదా
-జ్యూరీ అవార్డు ప్రకటించిన కేంద్రం
-అభినంద‌న‌లు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని కర్తవ్యపత్ లో జ‌రిగిన 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవం పెరేడ్‌లో భాగంగా ప్రదర్శించిన శ‌క‌టాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తుల క‌ళా ప్రాముఖ్యత చాటుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార‌స‌త్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శ‌క‌టం రిప‌బ్లిక్ డే పెరేడ్ ఉత్సవానికే హైలెట్‌గా నిలిచి యావ‌త్ దేశ ప్రజలందరి దృష్టిని ఆక‌ర్షించింది. సామాజిక మాధ్యమలలో సైతం లక్షలాది మంది ఈ శ‌క‌టానికి మంత్రముగడులై, ప్రశంస‌ల‌తో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంత‌ర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాల‌నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర స‌మాచార పౌర సంబంధాల శాఖ ఈ శ‌క‌టాన్ని రూపొందించింది. శ‌క‌టం ముందు వినాయ‌కుడు, చివ‌ర క‌లియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి ఎత్తైన రూపాల‌తో, ఇరువైపులా బొబ్బిలి వీణ‌లు, తెలుగువారి క‌ట్టుబొట్టు ప్రతిభింభించేలా అమ‌ర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శ‌క‌టం ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. శ‌క‌టం న‌డుస్తున్నంత సేపు ఏటి కొప్పాక బొమ్మల ప్రాశ‌స్త్యాన్ని చాటుతూ ‘’బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు, ఆంధ్ర ప్రదేశ్ బొమ్మలు, ఇవి విధ్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు, భ‌క్తి చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, స‌హ‌జ ప్రకృతి రంగులు’’ అంటూ సాగే గీతంతో ప్రజలందరి హృద‌యాల‌ను దోచుకుంది. రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శ‌క‌టం మ‌నోహ‌ర‌మైన రూపాన్ని చూసి పుల‌కించిపోయారు. అలాగే నెటిజ‌న్లు సైతం ఏపీ ప్రదర్శించిన ఏటి కొప్పాక బొమ్మల శ‌క‌టాన్ని పెద్ద ఎత్తున సామాజిక మధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. చాలా మంది నెటిజ‌న్లు త‌మ సామాజిక మధ్యమ సాధాన‌ల్లో త‌మ డీపీలుగా కూడా ఈ శ‌క‌టాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఓటింగ్‌లో కూడా పెద్ద ఎత్తున ఏటికొప్పాక శ‌క‌టానికి మదత్తు ప‌లికారు.

30 సంవత్సరాల త‌ర్వాత తొలిసారి జూరీ అవార్డు
దేశ రాజ‌ధానిలో జ‌రిగే గ‌ణ‌తంత్ర దినోత్సవాలలో ప్రదర్శించే శ‌క‌టాల‌కు సంబంధించి 30 సంవత్సరాల సంవ‌త్స‌రాల తర్వాత తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వ జూరీ పుర‌స్కారం ల‌భించింది. ఏటికొప్పాక బొమ్మ‌ల శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ తృతీయ బ‌హుమ‌తి ప్రకటించింది.

సీఎం, డిప్యూటీ సీఎం ప్ర‌శంస‌లు
ఏటికొప్పా శ‌క‌టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సైతం ప్రశంసించారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ముఖ్య‌ మంత్రి డిప్యూటీ సీఎంలు ఇద్దరూ త‌మ సామాజిక మధ్యమల వేదిక‌గా ఈ శ‌క‌టాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ద‌శాబ్దాల త‌ర్వాత రాష్ట్ర శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వ పుర‌స్కారం ల‌భించ‌డం ప‌ట్ల సర్వత్ర హ‌ర్షాతిరేకాలు వ్యాకషఅమౌతున్నాయి. ఏటి కొప్పాక బొమ్మలకు జియో ట్యాగింగ్ చేసి, ఈ బొమ్మలను అంత‌ర్జాతీయంగా కూడా ప్రసిద్దిని పొందేలా రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న‌ ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *