Breaking News

మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న‌ ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ
-బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు పెంచాలని విజ్ఞప్తి
-గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్రం గ్రాంట్ ను పెంచాలని కోరిన మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరో ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో వర్చువల్ గా సమావేశం అయ్యారు. కేంద్ర ఇంధన శాఖ సూచనలతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాల డిస్కంలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గురువారం ఈ సమావేశం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, రాజ‌స్తాన్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ లకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక ప‌రిస్థితుల పై కీలకంగా చర్చించారు. బకాయిలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట పట్టించి ముందుకెళ్లాల‌నే దానిపై మంత్రులు స‌మాలోచ‌న‌లు జరిపారు. అద‌న‌పు న‌ష్టాలు, ఖ‌ర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన, ఇతర మొండి బ‌కాయిల‌ వసూళ్ల పై ముఖ్యంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనితో పాటు పీఎం సూర్యఘర్, కుసుమ్ లాంటి పథకాలను ప్రోత్సహించి డిస్కంల భారాలను తగ్గించేలా కార్యాచరణ చేపట్టాని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశంలో బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి మెగావాట్ల నుంచి రెండు వేల మెగావాట్లకు పెంచాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రాన్ని కోరారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్రం గ్రాంట్ ను పెంచాలని మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి , సీపీడీసీఎల్ సీఎండీ భాస్కర్ ఇతరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భవిత్ సేవలు అభినందనీయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరతలు ఉన్న విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వారిని ప్రేమతో ఆదరిస్తున్న భవిత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *