-ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా కేంద్ర బెడ్జెట్
-పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉంది
-బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు
-ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు టర్మ్‌లోన్ పథకం ద్వారా రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం
-ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని అభిప్రాయపడిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు అని తెలిపారు. దీర్ఘ ఫలాలు వచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేశారని, అందుకే బడ్జెట్లో అన్ని రంగాలకు పెద్ద పీట వేశారని వివరించారు. బడ్జెట్ ద్వారా అన్నదాతలకు మేలు జరగనుందని వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచడం, స్టార్టప్‌లకు రూ.10 కోట్లు నుంచి రూ.20 కోట్లకు పెంచడం శుభపరిణామమన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు టర్మ్‌లోన్ పథకం ద్వారా రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైందన్నారు. రూ.50,65,345కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,71,437 కేటాయించి, వ్యవసాయ రంగ కేంద్రీకృత బడ్జెట్‌గా నిలిచి రైతుల మన్ననలు పొందింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ పరిమితిని 3 నుంచి 5లక్షలకు పెంచడం, కాటన్ మిషన్ ఏర్పాటు, జాతీయ విత్తన మిషన్ ఏర్పాటు, మత్స్య సంపద వృద్ధికి, ఆక్వా రైతులకు తోడ్పాటు కల్పించే చర్యలు, కొత్తగా అసోంలో యూరియా ప్లాంట్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం ద్వారా రైతాంగానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది’ అని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.