Breaking News

అభివృద్ధి ప్రతి గ్రామానికి.. సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలి…

కాకినాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి ప్రతి గ్రామానికి.. సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలనే కొత్త ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు పనిచేస్తున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్..కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కుడా చైర్మన్ తుమ్మల బాబు, పౌరసరఫరాల అధికారులు ఇతర ప్రజాప్రతినితో కలిసి పాల్గొన్నారు.
తొలుత పండూరు గ్రామంలోని పౌరసరఫరాల శాఖకు సంబంధించి ఎండియు ఆపరేటర్ ఏ.చిట్టిబాబు పంపిణీ చేస్తున్న నిత్యవసర సరుకులు నాణ్యతను పరిశీలించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పండూరు గ్రామస్తుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్లు మంజూరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణం, కలుషితమైపోయిన పండూరు చెరువును బాగు చేయడంతో పాటు చుట్టూ వాకింగ్ ట్రాక్, స్మశాన వాటిక, తమ్మవరం భూములు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసేమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రతి గ్రామానికి..సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలనే కొత్త ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. పండూరు గ్రామంలో ఉన్న 1,834 గృహాలకు గాను 1,682 బియ్యం కార్డుదారులకు దీపం-2 పథకం కింద నూటికి నూరు శాతం లబ్ధి పొందుతున్నారన్నారు. దీపం -2 పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించమన్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లు, కాలువలు, పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి తెలిపారు. గ్రామస్తులు కోరిక మేరకు వచ్చే ఏడాది వేసవి నాటికి పండూరు చెరువును ఆధునీకరించి గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు వాకింగ్ ట్రాక్ ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాన్నారని దినిలో భాగంగా పంచాయతీల అభివృద్ధికి చర్యలు చేపడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు ఇతర అవసరతలను గ్రామపంచాయతీ ద్వారా ఒక ప్రణాళిక ప్రకారం పని చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్లాస్టిక్ బియ్యం అంటూ చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఫోర్టుఫైడ్ బియ్యాన్ని కలిపి అందిస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి రూ.46.10పైసలు ఖర్చు చేస్తుందని దానిని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని మంత్రి సూచించారు. పౌరసరఫరాల ద్వారా ప్రతినెల బియ్యంతో పాటు పంచదార, రూ.60లకే కందిపప్పును అందిస్తుందన్నారు. భవిష్యత్తులో రాగులు, ఇతర మిల్లెట్స్ కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో తొలిసారిగా మే నెల నుంచి పాఠశాలలు తెరిచే సమయానికి సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి మనోహర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1లక్ష 14వేల మెట్రిక్ టన్నులు రైతులు నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అధికార యంత్రం అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 220 కోట్లు రూపాయలు ప్రతినెల పింఛన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా మే నెల లో రూ.9,600 కోట్లతో తల్లి వందనం పేరుతో 15 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీలో ఒకేరోజు గ్రామసభ నిర్వహించి, గ్రామ సభ తీర్మానాలు చేసి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. 2028 నాటికి ఇంటికి జలజీవన్ మిషన్ పథకం కింద కుళాయిలు ద్వారా తాగు నీరు అందివడం జరుగుతుందని తెలిపారు. మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారిని, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. చుక్కల భూముల సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినప్పటికీ మరొకసారి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పండూరు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆదర్శవంతమైన గ్రామంగా పండూరును తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో 580 మార్కులు సాధించిన పండూరు గ్రామ విద్యార్థి లక్ష్మీ దుర్గను మంత్రి మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు మార్పు ఏమైనా కోరుకుంటున్నారా, ఇతర ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పండూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పండూరు గ్రామంలో చాలావరకు సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో మూడు సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నట్లయితే మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చినట్లైతే వాటిని పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వాకలపూడి, కాకినాడ రూరల్, పండూరులో గ్రామాల్లో మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతులు మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సుమారుగా 500 కుట్టు మిషన్లు వచ్చాయని ఆయన తెలిపారు. పండూరు గ్రామంలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎం.దేవులా నాయక్, డీఎస్వో ఆర్ఎస్.సత్యనారాయణ రాజు, పండూరు ఎంపిటిసి అనంతలక్ష్మి, కాకినాడ రూరల్ మండలం అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *