Breaking News

ఈ నెల 15లోపు డిస్ప్లే ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మీడియా డివైజ్ డిస్ప్లే బోర్డ్స్ నిర్వహకులు ఈ నెల 15లోపు డిస్ప్లే ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలని, చెల్లించని వారి బోర్డ్ లను 16వ తేదీ నుండి తొలగిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గత ఫిబ్రవరి 24న బోర్డ్స్ ఏజన్సీల నిర్వహకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత ఏడాది, గతంలోని బకాయిలు మొత్తం మార్చి 15లోపు చెల్లించాలని తెలిపామని, వారు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని ఎక్కువ మంది ఫీజులు చెల్లించలేదని, అటువంటి వారి బోర్డ్ లను 16వ తేదీ నుండి పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. వార్డ్ సచివాలయాల వారీగా ఫీజులు చెల్లించిన, చెల్లించని వారి వివరాలతో 15వ తేదీ సాయంత్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించామన్నారు. కనుక బకాయిలు 15వ తేదీలోపు చెల్లించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *