అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సమేతంగా కలిశారు. ఈ నెల 23 న లబ్బీపేటలోని ఎస్. ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు జరగనున్న తమ ద్వితీయ కుమార్తె చంద్రిక వివాహ వేడుకకు హాజరు కావలిసిందిగా దంపతులను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రిక అందజేసి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరారు. పెళ్లి పత్రిక స్వీకరించిన ఆయన తప్పకుండా వివాహానికి వస్తానని తెలియజేశారు.
