-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఎ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వారి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి పట్టభద్రులంతా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కోరారు. శనివారం ఉదయం మొగల్రాజపురంలోని మోడరన్ అకాడమీలోని ఉపాధ్యాయులను గద్దె అనురాధ కలిసి కూటమి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్దె అనురాధ మాట్లాడుతూ విద్యావంతులంతా ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోడరన్ అకాడమీ ప్రిన్సిపల్ సుంకర పాపారావు, పేరేపి ఈశ్వర్, పెనుగొండ శ్రీనివాస్, మల్లెల రామకృష్ణ, కోటా శివ లక్ష్మి, కర్రీ రాజేష్, కలపాల విక్రమ్ తదితరులు ఉన్నారు.