-ఆలపాటి విజయం నల్లేరు పై నడకే
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రిగా, తెనాలి శాసనసభ్యుడిగా గతంలో పనిచేశారని, పట్టభద్రుల సమస్యలపై ఆయనకు ఎంతో అవగాహన ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ పెద్దలు బలపరిచిన ఆలపాటిని గెలిపించి శాసనమండలికి పంపిస్తే అక్కడ పట్టభద్రుల వాణి వినిపిస్తారన్నారు. ఆలపాటి రాజా విజయం నల్లేరుపై నడక అని కానీ అత్యధిక మెజార్టీ అందించి కూటమి ప్రభుత్వ మంచి పాలనకు గుర్తింపు ఇవ్వాలన్నారు. శనివారం మధ్యాహ్నం పడమట లోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ పాఠశాలలోని అధ్యాపకులను గద్దె అనురాధ కలిసి వారితో సమావేశం నిర్వహించి ఆలపాటి రాజాను గెలిపించాలని కోరారు.
ఈ సందర్బంగా గద్దె అనురాధ మాట్లాడుతూ పార్టీ నియమాలు, సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి ఆలపాటి రాజా అని, తన సీటును జనసేనకు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ కూడా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు రాజన్న తెస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ఒప్పిచ్చి పట్టబదుల సమస్యలు తీర్చగలిగిన శక్తి, సామర్ధ్యం ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్ ను గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై గట్టిగా పోరాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవినేని అపర్ణ, కోనేరు రాజేష్, పేరేపి ఈశ్వర్, కలగర మాలతీ, పాలడుగు దుర్గాప్రసాద్, చాలసాని వాసు, వి. సుగుణ, జె. సురేష్, పాఠశాల ప్రిన్సిపాల్, పలువురు అధ్యాపకులు ఉన్నారు.