విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ పార్టీల సలహాలు సూచనలను ముఖ్య ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా. జి. లక్ష్మి శ అన్నారు.
భారత ఎన్నికల సంఘం ఈనెల నాలుగు, ఐదవ తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల నిర్వహణను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో ప్రతినెల సమావేశం నిర్వహించి సలహాలు సూచనలను స్వీకరించాలని ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా. జి. లక్ష్మి శ జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం వెయ్యి మంది ఓటర్లు ఉండే విధంగానూ, కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే డోర్ నెంబర్ లో ఓకే సీరియల్ నెంబర్ తో ఒకే చోట ఉండే విధంగానూ, పాత ఎపిక్ కార్డుల స్థానంలో కొత్త ఎపిక్ కార్డులు జారీ చేయాలని, ప్రతి పోలింగ్ బూత్ ఎలక్ట్రాల్ రోల్ పై ముఖచిత్రం ఉండాలని, కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే వారికి బిఎల్వోలు వారి మొబైల్ నెంబర్లతో అందుబాటులో ఉండాలని, పోలింగ్ జరిగే సమయంలో ప్రజా ప్రతినిధులు పోలింగ్ కేంద్రంలోకి రాకుండా నివారించాలని సమావేశం దృష్టికి తీసుకువస్తూ వారి సలహాలు, సూచనలను జిల్లా ఎన్నికల అధికారి ద్వారా సీఈఓ దృష్టికి తీసుకురావాలని సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు.
సమావేశంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, వై రామయ్య (టిడిపి), వై. ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్ సిపి), పి. ఏసుదాసు (ఐఎన్సి) డి.వి. కృష్ణ (సిపిఐ(ఎం)) తరుణ్ కాకాని (బిజెపి) పాల్గొన్నారు.