– ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి
– తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించండి
– పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు జరగబోయే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించాలి. విధ్యాభ్యాసంలో పదో తరగతి పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఉన్నత విద్యాభ్యాసానికి కీలకంగా నిలిచే మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.