కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం కలెక్టరేట్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం నిరాహార దీక్ష చేపట్టి, ఆంధ్ర రాష్ట్రo ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన గొప్పవ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. 1901 మార్చి 16 న పడమటిపల్లి, నెల్లూరు జిల్లాలో జన్మించారు. నేడూ ఆయన 125 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏడాది మార్చి 16 న రాష్ట్ర ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని రాష్ట్ర వేడుకగా జరుపుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో అటువంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక , కలక్టరేట్ ఇతర కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, ఏ బి సి డబ్లయువో లు ముత్యాల సుబ్బారావు, పి రామకృష్ణ, హెచ్డబ్లయువో లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి…

-పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి. -పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి. -జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *