గీతావారసత్వ విలువలను అందించాలి…

-ఇస్కాన్‌ మందిర అధ్యక్షులు శ్రీమాన్‌ చక్రధారిదాస్‌

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
గీతావారసత్వ విలువలను విద్యా ప్రారంభ దశ నుండే పిల్లలకు అందించాలని ఇస్కాన్‌ మందిర అధ్యక్షులు శ్రీమాన్‌ చక్రధారిదాస్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్క్రూ బ్రిడ్జి జగన్నాథ్‌ మందిర్‌ వద్ద జరిగిన విలువైన విద్య పోటీలలో 70 స్కూల్స్‌ నుండి 6 వేలు మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో గెలుపొందిన విద్యార్థులకు సీనియర్‌, జూనియర్‌ విభాగాలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లోకేశ్వర్‌ కృష్ణవేణి పటమట స్కూలు, పవన్‌కుమార్‌ విశ్వభారతి స్కూల్‌, విద్యార్థులకు పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, కేబీఎన్‌ కళాశాల హెచ్‌ ఓ డి రమేష్‌బాబు, మాజీ ప్రిన్సిపాల్‌ వీ నారాయణరావు, తూనుగుంట్ల శ్రీనివాస్‌, పిబి సిద్ధార్థ కన్వీనర్‌ శశికళ, తేజస్వి సైకిల్‌ స్టోర్‌ అధినేత అంతిమ కృషాల్‌ పాల్గొని సందేశం ఇచ్చారు. గీతా వారసత్య విలువలు ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలతో భగవద్గీతను పఠింపచేయాలని సూచించారు. అనంతరం విజేతలందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి…

-పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి. -పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి. -జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *