అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ ఖలీఫా తుల్లా బాషా డిల్లీ లోని భారతీయ జనతా మాజ్దూర్ సెల్ జాతీయకార్యాలయంలో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ జాతీయ చైర్మన్ బిశ్వ ప్రియా రాయ్ చౌదరి మరియు భారతీయ జనతా మాజ్దూర్ సెల్ అధ్యక్షుడు అర్నాబ్ ఛటర్జీ సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో యన్.ప్రశాంత్.కుమార్ జాతీయ కార్యదర్శి, సహా ప్రముఖ జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్బంగా కొత్త అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం షేక్ ఖలీఫా తుల్లా బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక సమస్యలను పరిష్కరించడం మరియు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తానన్నారు రాష్ట్ర కార్మిక దృశ్యాన్ని రూపొందించడంలో మరియు కార్మికుల హక్కుల కోసం వాదించడంలో కీలకం గా పనిచేసి కార్మికులకు సరైనా న్యాయం ఇపిస్తానని అన్నారు.
భారతీయ జనతా మజ్దూర్ సెల్ (BJMC) భారతీయ జనతా పార్టీ (BJP)లో కార్మిక సంక్షేమం మరియు కార్మికుల హక్కులపై దృష్టి సారించే ముఖ్యమైన సంస్థఅనీ కార్మిక ఎజెండాను ప్రచారం చేయడంలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో సన్నిహితంగా ఉండటంలో BJMC కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
షేక్ ఖలీఫా తుల్లా బాషా నియామకం కార్మిక సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావానికి, నిబద్ధతకు నిదర్శనం. ఆయన నాయకత్వంలో, ఆంధ్ర ప్రదేశ్ BJMC రాష్ట్రంలో కార్మికుల హక్కులను పెంపొందించడానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ తరుపున కార్మికులు లకు అందే పలు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తానని సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.