Breaking News

ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులు…

-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాథమిక దశలోనే విద్యార్థుల పునాధికి నాందిపలికే విధంగా విద్యావ్యస్థను రూపొందించి తద్వారా ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే విధంగా తెలుగు విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా విద్యా శాఖ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై తగు సూచనలు, సలహాలు అందజేసి పటిష్టమైన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సహకరించాలని ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులను ఆయన కోరారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విదానం-2020 సిఫార్సుల అమలుపై మంత్రి అద్యక్షతన ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులతో సచివాలయ ప్రాంగణంలో మంగళవారం చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలకు అదర్శంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు విద్యా సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో అమలు పర్చే మనబడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాలకు పలువురు ప్రముఖుల నుండి ప్రసంశలు అందాయన్నారు. జాతీయ విద్యా విధానం రూపకర్త డా.కస్తూరి రంగన్ రాష్ట్రంలో అమలు చేయబడుచున్న పలు విద్యా పథకాలను ఎంతగానో ప్రశంసించారని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణా ప్రభుత్వం మన విద్యా పథకాల పరిశీలనకై ఒక సబ్ కమిటీని ఇప్పటికే రాష్ట్రానికి పంపిందని ఆయన తెలిపారు. రూ.3,600 కోట్లతో తొలి దశ నాడు-నేడు పనులను పూర్తిచేయడం జరిగిందని, రెండు, మూడు దశల్లో మరో రూ.15 వేల కోట్ల ను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. అదే విదంగా జగనన్న విద్యా కానుక క్రింద గత ఏడాది రూ.400 కోట్లను వెచ్చించడం జరిగిందని, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు పరుస్తున్నామని మంత్రి తెలిపారు. ఇదే స్పూర్తితో జాతీయ విద్యా విధానం-2020 సిఫార్సులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కర్ణలను అమలు పర్చేందుకు ముసాయిదా ప్రతిపాదనలు రూపొందరిచడం జరిగిందన్నారు. ప్రాథమిక విద్యా వ్యవస్థను పటిష్టంగా అమలు పర్చడం ద్వారా ప్రాధమిక దశలోనే విద్యార్థికి పటిష్టమైన పునాదికి నాంది పలికేందుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. పూర్వప్రాధమిక విద్య ఎల్.కె.జి.,యు.కె.జి. విదానాన్ని పి.పి.-1 , పి.పి.-2 తరహా అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించామన్నారు. పూర్వ ప్రాథమిక విద్య నుండి (+2) ఇంటర్మీడియట్ వరకూ విద్యను అందించే అరు అంచెల నూతన విద్యా విధానానికి ప్రతిపాదించామన్నారు. అందుబాటులో నున్న బౌతిక, మానవ వనరులను పటిష్టంగా ఉపయోగించుకొనేలా మూడు అంచెల్లో ఫౌండేషన్ స్కూల్స్ మరో మూడు అంచెల్లో హై స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. జూనియర్ కళాశాలలు లేని మండలాల్లోగల 202 హైస్కూళ్లలో (+2) ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ విదానం అమల్లో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను మూసేయడం జరగదని, ఎటు వంటి పోస్టులను కూడా తొలగించడం జరగదని మంత్రి స్పష్టంచేశారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందజేయాలని ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులను మంత్రి కోరారు.
శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేయబడుచున్న పలు విద్యా పథకాల అమలు తీరును ఆయన అభినందించారు. ఎటు వంటి పథకాలు, సంస్కరణలు అయినా విజయవంతంగా అమలు కావాలంటే క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉపాద్యాయులు, వారి సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులు సహాయ, సహకారాలు ఎంతో అవసరమని విషయాన్ని విద్యా శాఖ ఉన్నతాధికారులు గుర్తించాలని అయన కోరారు. ఈ ముసాయిదా అమలు విషయంలో వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జాతీయ విద్యా విదానం-2020 సిఫార్సుల అమలుకు అనుగుణంగా రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఉపాద్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులకు వివరించారు. అందుబాటులో ఉన్న బౌతిక, మానవ వనరులను పటిష్టంగా వినియోగించుకుంటూ పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యా వ్యవస్థను పటిష్ట పరచేందుకు మరియు పూర్వ ప్రాథమిక విద్య నుండి (+2) ఇంటర్మీడియెట్ వరకూ విద్యను అందజేస్తూ గ్లోబల్ సిటిజన్స్ గా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ విదానాన్ని రూపొదించడం జరిగిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని అంగన్ వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, 3,178 ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల పరిధిలోనున్న 3,627 ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలలకు ఒక కిలో మీటరు పరిధిలోని 8,412 ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదనంగా విద్యార్థులను తీసుకొనే ఉన్నత పాఠశాలలకు అదనపు తరగతి గదులను నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని మండలాల్లోగల 202 హైస్కూళ్లలో (+2) ఇంటర్మీడియట్ విద్యా విదానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. అదే విధంగా డిమాండ్ మేరకు హైస్కూల్ పరిధిలో ఒక కిలో మీటరు పైబడి ఉన్న ప్రాథమిక పాఠశాలలను 2023-24 విద్యా సంవత్సరంలో మ్యాప్ చేయడం జరుగుతుందన్నారు. ఈ విదంగా ఆరు అంచెల నూతన విద్యా విధానం రాష్ట్రంలో అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులు ఈ ముసాయిదా ప్రతిపాదనలో పలు మార్పులు, చేర్పులు చేసేందుకై తమ తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీర భద్రుడు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ వి.రామకృష్ణ, ఇన్ప్రా ఎడ్వైజర్ ఎ.మురళీ, స్లెట్ డైరెక్టర్ కె.మస్తానయ్య తదితరులతో పాటు ఉపాధ్యాయ, గ్రేడ్యుయేట్స్ శాసన మండలి సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *