Breaking News

రైతు సమస్యలు పరిష్కరించేేందుకే రైతు స్పందన కార్యక్రమం…

– ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి…
-నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం…
-వ్యవసాయాధికారి ఆంజనేయులు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి వ్యవసాయ సంబందిత సమస్యపై అందించిన వినతి పత్రాలను వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తాను పండించే పంటకు సంబందించి ఈ – క్రాప్ లో నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. తుఫానులు, వరదలు, ఇతర కారణాలు వలన పంట దెబ్బతిన్నపుడు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు క్రాఫ్ ఇన్సూరెన్, ఇన్ పుట్ సబ్సిడి వంటి పరిహారంతో పాటు ఆర్బీకేల ద్వారా ధాన్యానికి మద్దతు ధరను అందిస్తారన్నారు. రైతు స్పందన ద్వారా రైతుల సమస్యల పై వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు నెలలో ప్రతి మొదటి, మూడవ బుధవారం రైతు స్పందనా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. భూమిని సారవంతం చేసేందుకు 50 శాతం సబ్సిడిపై గుడివాడ రూరల్ మండలంలో జీలుగు, పిల్లిపెసర, జనుము వంటి 89 క్వింటాళ్ల విత్తనాలు 364 మంది రైతులకు అందించామన్నారు. ఖరీఫ్ సాగుకు సంబందించి 188 మంది రైతులకు 83 క్వింటాళ్ళ వరి విత్తనాలను అందించామన్నారు. గుడివాడ రూరల్ మండలంలో రైతు భరోసా ద్వారా 4,475 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమచేసామని, పియం కిసాన్ పథకం ద్వారా వచ్చే నగదు జమ కావల్సి ఉందన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వారి గ్రామాల్లోనే ఉన్న ఆర్బీకేల ద్వారా అందిస్తున్నామన్నారు. నేడు రైతు స్పందన కార్యక్రమంలో 5 మంది రైతులు సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అందజేశారన్నారు.
అర్జీలు :- గుడివాడ రూరల్ మండలం నూజెళ్ళ గ్రామానికి చెందిన రైతులు పర్వతనేని సాయిబాబు, పీ.వీ. లక్ష్మి, బొమ్ములూరు, చినఎరుకపాడు, శేరే వేల్పూరు రైతులు ఎస్.వి. సుబ్రహ్మణ్యం, మురళీ కృష్ణ, ఎస్. రామగోపాల్ తమ అర్జీల్లో రైతు భరోసా ఆర్థిక సహాయం జమ అయ్యిందని, పియం కిసాన్ పథకంద్వారా వచ్చే ఆర్థిక సహాయం ఖాతాల్లో జమకాలేదని జమచేయవలసింది కోరారు. రైతు స్పందనా కార్యక్రమానికి మత్స్యశాఖ సహాయ సంచాలకులు, డి. సాంబశివరావు, డ్రైనేజీ ఏఇ డి.వి.వి. ప్రసాద్, ఇరిగేషన్ ఏఇ ఆర్ అమరేశ్వరరావు, ఏపీసీపీడీఇఎల్ ఏఈ ఎన్. సురేష్, డిప్యూటీతాహశీల్థారు గోపాల్ తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *