సంక్షేమఫల రథసారథి వైయస్ జగన్ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైస్సార్సీపీ ప్రభుత్వం అని,కులమత పార్టీలకతీతంగా అందరికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని పటమటలంక రోడ్డు నందు డివిజన్ ఇన్ ఛార్జ్ వల్లూరి శారదా  ఆధ్వర్యంలో జరిగిన 9వ డివిజన్ పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ,వాలంటీర్ వ్యవస్థ ల ద్వారా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పారదర్శకంగా గడప వద్దకె సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, దేశంలో మరే ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్మోహన్ రెడ్డి  మహిళల పేరు మీద ఇళ్ల పట్టాల పంపిణీ గాని,వారి ఆర్థిక సౌలభ్యం కోసం వైయస్ఆర్ ఆసరా, చేయూత, అమ్మఓడి వంటి పధకలు,నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన గాని, విద్య కానుక ద్వారా విద్యార్థులకు సకల వసతులు అందజేయడం ద్వారా అప్పుడే పుట్టిన పిల్లవాడి నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరెలా నవరత్నాలు అమలు చేస్తున్నారని అన్నారు.అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ డివిజిన్ లో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మరో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని తెలిపారు. గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ లు టీడీపీ వారే అయ్యుండి కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని, పటమాట లంక మెయిన్ రోడ్డు, రామాలయం వీధి ,ఇతర ముఖ్యమైన విధులు అన్ని కూడా అద్వాన్నంగా తయారయ్యని,కానీ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడి కాలనీ వాసులు సమస్యలు మా దృష్టికి తెచ్చిన వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేపించడం తో పాటు,ఆయానతోనే శంకుస్థాపన చేపించి నేడు పనులు పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన డ్రామాలు, ప్రచార ఆర్భాటాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేయలేదని ఎన్నికల అప్పుడు వచ్చి ఓట్ల కోసం కన్నీటి బొట్లు రాల్చడం తప్ప గెలిచిన తరువాత ప్రజల గురుంచి పట్టించుకోలేదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఓడిపోయిన సరే పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేస్తున్నామని,టీడీపీ లాగా ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక నారా లోకేష్, టీడీపీ నాయకులు శవ రాజకీయాలకి తెరలేపారు అని,మీరు ఎన్ని కుట్రలు చేసిన రాబోయే 30 సంవత్సరాలు జగన్ గారే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘాటించారు. టీడీపీ హయాంలో ఎంత మంది దళితులకు అన్యాయం జరిగిందో ప్రజలు మర్చిపోరాని లోకేష్ ఆ వాస్తవాలు తెలుసుకొంటే మంచిదని,అంతేగాని మీ కార్యకర్తలను మురిపించాలని పిడికిలి బిగిస్తే, గడ్డాలు పెంచితే నాయకులు అవ్వరని హితవుపలికారు.మీ కపట ప్రేమలు,షో రాజకీయాలు ఇక కట్టిపెట్టలని ఎద్దేవా చేశారు. సచివాలయంలో ప్రజలకు ఏదైనా సాంకేతిక కారణాల వలన ఇబ్బంది ఏర్పడితే ఈ పరిష్కార వేదిక ద్వారా మా దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ అంబేద్కర్, రామిరెడ్డి వైసీపీ నాయకులు, వల్లూరు ఈశ్వర ప్రసాద్, ఆళ్ల చల్లారావు, సుబ్బరాజు, పద్మావతి, రజిని, కాళీ, దామోదర్, సుజాత, హరీష్, నవీన్, ఉకోటి రమేష్, కాళేశ్వరవు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *