Breaking News

కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో సచివాలయం, ఆర్బీకేల నిర్మాణ పనులను ప్రారంభం…

-కైకలూరు నియోజకవర్గంలో తొలి దశలో 6100 గృహాలను నిర్మిస్తున్నాం..
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాలు అభివృద్ధి జరిగినపుడే, రాష్టం బాగుంటుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్యఉపకేంద్రం, బల్క్ మిల్క్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీలలో సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్, మిల్క్ ప్రాజెక్టు లకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి నూతన భవన నిర్మాణాలను ప్రారంబిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రజలకు పరిపాలన నేరుగా అందాలనే లక్ష్యంతో గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను రూపొందించారని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ప్రతి ఒక్కరికి పరిపాలన నేరుగా అందిస్తున్నా రన్నారు. క్యాలెంటరీ వారీ సంక్షేమ పధకాల ను లబ్దిదారులకు అందిస్తున్నారన్నారు. ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే బడుగు, బలహీన వర్గాల అక్కచెల్లమ్మలకు 12 వేల పైబడి ఇంటి పట్టాలు ఇచ్చామని, దానిలో మొదటి విడతగా 6100 మంది అక్కచెల్లమ్మలకు ఇంటి నిర్మాణాలకు అనుమతులిచ్చారన్నారు. మీ గ్రామానికి మెయిన్ రోడ్డు నుంచి 4 మీటర్ల వెడల్పు సీసీ రోడ్లకు రూ.40 లక్షలు తో అనుమతులు వచ్చాయని, త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిమన్నారు. మంచినీటికి ఇబ్బందులు లేకుండా ఇంటి ఇంటికి ఉచిత మంచినీటి కుళాయితో పాటు గ్రామాల్లో నూతన ఓహెచ్ ఆర్ ఎస్ ఫిల్టర్ బెడ్లు, సంపు, ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు. అదేవిదంగా గ్రామంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ పనులను కూడా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈఈ పగడాల సురేష్,ఏఇఇ శ్రీనివాస్,ఎస్ఐ.తోట రామకృష్ణ, సర్పంచ్ జయమంగళ తిరుపతి వెంకన్న, మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామదుర్గాప్రసాద్,నాయకులు, ముంగర మల్లికార్జునరావు, ఎంపీటీసీ జయమంగళ వీరాజు, వైస్ సర్పంచ్ మోరు కృష్ణ మోహన్, జయమంగళ రాములు, పత్తిపాడు సర్పంచ్ బేతపూడి రాజు, జయమంగళ కృష్ణ, ముంగర రంగారావు,ఘంటసాల ఏడుకొండలు, జయమంగళ నాగరాజు, ముంగర జైబాబు, రాఘవేంద్రరావు, వినాయకుడు, పెద్దఆంజనేయులు, సహదేవుడు, విష్ణుబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *