-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందన్న మంత్రి దుర్గేష్
-నిడదవోలులోని కార్యాలయంలో 33 మంది బాధితులకు రూ.30,94,913 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
-ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 192 మందికి రూ. 1.84 కోట్ల లబ్ధి చేకూర్చామన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటిదని, తద్వారా పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ తెలిపారు. సోమవారం నిడదవోలులోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో సతమతమవుతున్న 30 మంది బాధిత లబ్ధిదారులకు రూ.22,94,913 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మరో ముగ్గురికి రూ.8 లక్షల విలువైన ఎల్ వోసీ పత్రాలను స్వయంగా పంపిణీ చేశారు. మొత్తంగా 33 మంది బాధితులకు రూ.30,94,913 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 192 మందికి రూ. 1.84 కోట్ల లబ్ధి చేకూర్చామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని లబ్ధిదారులు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిరుపేదలు ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వారికి ఆర్థికంగా ఇబ్బంది కలుగకుండా సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగానికి గురై వైద్యం చేయించే స్థోమత లేని ఎంతోమంది పేదలు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం పొంది ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని, ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు.
చెక్కులు అందుకున్న వారిలో నిడదవోలు పట్టణం, తీరుగూడెం, పందలపర్రు, విజ్జేశ్వరం, డి.ముప్పవరం, గోపవరం, ఉనకరమిల్లి , ఉండ్రాజవరం, కాల్దారి, చివటం, వడ్లూరు, పాలంగి, మోర్త, వెంకట్రాయపురం, ముక్కామల, కానూరు, కాపవరం, ఉసులుమర్రు, ఖండవల్లి, అన్నవరప్పాడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులున్నారు.
Prajavartha Online Telugu News