ప్రతి సోమవారం కలెక్టరేట్ లో చేనేత ప్రదర్శన

-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ రంగ హస్తకళల అభివృద్ధి సంస్థ “ఆప్కో” ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక వస్త్రాల స్టాల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రజలకు 30 శాతం రిబేట్ పై ఆప్కో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారు నేసిన వస్త్రాలను వినియోగించటం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చని ,, ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజు చేనేత వస్త్రాలను ధరించాలని పేర్కొన్నారు.

ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు ఆప్కో చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా ప్రజలు చేనేతను ప్రోత్సహిస్తూ ఆప్కో వస్త్రాల కొనుగోలును ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మన భారతీయ సాంస్కృతిక చిహ్నాలుగా చేనేత వస్త్రాలు విశిష్టమైన గుర్తింపు కలిగి ఉన్నట్లు తెలిపారు. మన్నికకి , నాణ్యత ప్రమాణాలు విషయంలో చేనేత వస్త్రాలు తనదైన గుర్తింపు కలిగివున్నట్లు తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *