18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి…

-ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలను పాటించాలి.
-తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రభుత్వఉద్యోగులు రెండు రోజుల్లో వారి పరిధిలో గల సచివాలయాల్లో సరెండర్ చెయ్యాలి..
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా 2022 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిదిలోని 18 సంవత్సరాలు వయస్సు గల యవతీ, యువకులు తమ ఓటు హక్కును ఆన్ లైన్ లో గాని లేదా ఆఫ్ లైన్ ద్వారా గాని నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆన్ లైన్ లో అయితే www.election commission of india వెబ్ సైట్ లోను, అదే ఆఫ్ లైన్ ద్వారా అయితే సంబందిత మండల తాహశీల్థారు కార్యాలయంలోని ఎలక్షన్ డీటీ గాని సంప్రదించి తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఆదార్ మరియు పేర్లు తప్పులుగా ఉన్నట్లయితే మార్పులు చేర్పులకు సంబందించి ఫారమ్ 6,7,8 ద్వారా మార్చుకునేందుకు ఎన్నికల కమీషన్ అవకాశం కల్పించిందన్నారు. సోమవారం డివిజన్ పరిదిలో సోమవారం 16 కరోనా పోజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ముదినేపల్లి మండలంలోని రెండు పాఠశాలల్లో పది మంది విద్యార్థులకు కరోనా పోజిటివ్ గా పరీక్షల్లో వెల్లడయ్యిందన్నారు. ఈ రెండు పాఠశాలలకు ప్రస్తుతం సెలవులు ప్రకటించామన్నారు. పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటేషన్ వినియోగించాలన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డు కలిగి వున్నారని తనిఖీల్లో నిర్థారణ అయ్యిందని, కావున తెల్ల రేషన్ కార్డు కలిగివున్న వారందరూ తమ పరిదిలో గల గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటి రెండు రోజుల్లో సరెండరు చెయ్యాలన్నారు. లేని పక్షంలో వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *