Breaking News

ప్రతి ఇంటికీ స్వచ్చమైన త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యం…

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జలజీవన్ మిషన్…
-గ్రామాల్లో తాగునీటి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకే గ్రామస్థాయి కమీటీలకు శిక్షణా కార్యక్రమం…
-ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుళాయిలలు ద్వారా ప్రతి ఇంటికీ శుద్ది చేసిన స్వచ్చమైన తాగునీటిని అందించాలన్నదే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యమని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు ఎన్.వి.వి. సత్యనారాయణ అన్నారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలం తాగునీటి నాణ్యత మరియు పరిరక్షణపై గ్రామ స్థాయి కమిటీ సభ్యులైన ఏఎన్ఎం,ఆశావర్కర్,అంగన్వాడీ టీచర్, ఎస్ హెచ్ జీ మెంబరు, విడబ్ల్యూఎస్ సీ మెంబరు మరియు ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్నియంపీడీవో ఏవీ రమణతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో 2024 నాటికి కుళాయిలు ద్వారా శుద్దిచేసిన స్వచ్చమైన తాగునీటిని ఇంటింటికీ రోజుకు 55 లీటర్లు చొప్పున అందించాలన్నదే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యమన్నారు. ఇప్పటికే ఈ పనులు జిల్లాలో జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలకు నీటి నాణ్యతను నిర్థారించే ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఇవ్వడంతో పాటు వినియోగం పై శిక్షణను అందించామన్నారు. గ్రామ స్థాయిలో తాగునీటి పరీక్షలు నిర్వహించేందుకు 8 పేరామీటర్లపై గ్రామస్థాయి కమిటీ సభ్యులకు నేడు శిక్షణను అందిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు దశలవారీ పనులు జరగుతున్నాయని ఈ పక్రియ 2024 నాటికి పూర్తవుతుందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పన ఒక భాగమైతే స్వచ్చమైన నీటి నిర్వహణకు ఆయా గ్రామ పంచాయితీలు నాణ్యతా ప్రమాణాల పరీక్షలను నిర్థారిస్తూ గ్రామీణ ప్రజలకు నీటి సరఫరాను చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో తాగునీటి పరిశీలన, పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాలు, త్రాగునీటిలో కలుషితాలు గుర్తింపు, సూక్ష్మజీవుల గుర్తింపు, భౌతిక రసాయనిక పరీక్షలు,క్లోరినేషన్, పీల్టు టెస్ట్ కిట్ల వినియోగం, తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామస్థాయి తాగునీరు మరియు పారిశుద్ద్యం కమీటీ సభ్యులకు అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో యంపీడీవో ఏ. వెంకట రమణ, ఇవోఆర్డీ డి. వెంకటేశ్వరరావు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఇ ఏ. వెంకటేశ్వరరావు,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయితీ కార్యదర్శులు, అంగన్ వాడీ టీచర్లు, అశా వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *